కేటీఆర్ ను ఆహ్వానించిన టీడీపీ నాయకురాలు

Friday, May 25th, 2018, 08:18:27 AM IST

రాజకీయాల్లో వాతావరణం ఎలా ఉన్నా కూడా నేతలు వ్యక్తిగత విషయంలో మాత్రం చాలా ఫ్రెండ్లిగా ఉంటారు. ఈ రోజుల్లో కొందరు రాజకీయ పోటీని పర్సనల్ గా తీసుకొని సాగుతుంటే టీఆరెస్ నేతలు మాత్రం అలాంటి ఆలోచనతో కాకుండా ఇతర పార్టీల నేతలను కలుపుకుంటూ పోతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను తెలుగు దేశం పార్టీకి చెందిన ఏపీ మంత్రి అఖిలప్రియ కలుసుకున్నారు.

మంత్రి అఖిల ప్రియ వివాహం ఉన్నందున ఆమె కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అఖిల ప్రియతో పాటు కాబోయే భర్త భార్గవ్ కూడా కేటిఆర్ ని కలిశారు. ఇక కేటిఆర్ భూమా అఖిలప్రియ తల్లి దివంగత భూమా శోభా నాగిరెడ్డిని తలచుకుంటూ.. 2009-2014 మధ్యలో శాసనసభ్యులుగా పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు. అదే విధంగా జ్ఞాపికను అందిస్తూ తప్పకుండా పెళ్లికి వస్తానని కేటీఆర్ కాబోయే వధూవరులకు మాటిచ్చారు. ఇక ఆగస్టు 29న అఖిల ప్రియ వివాహం జరగనుంది.

  •  
  •  
  •  
  •  

Comments