గజ్వేల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం : 11మంది మృతి, 25మందికి తీవ్ర గాయాలు!

Sunday, May 27th, 2018, 10:15:38 PM IST

గజ్వెల్ జాతీయ రహదారిపై నిన్న సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే సారి నాలుగు వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రమాదం ఎక్కడా చోటుచేసుకోలేదు. వివరాల్లోకి వెళితే మంచిర్యాలకు చెందిన గరుడ ఆర్టీసీ బస్సు 42మంది ప్రయాణీకులతో సిద్దిపేటవైపు వెళుతుండగా, గజవెల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద అటుగావెళ్తున్న లారీని వెనుకనుండి వేగంగా ఢీకొట్టడంతో అదుపుతప్పిన లారీ రోడ్డుకు అవతలివైపుగా వెళుతున్న క్వాలిస్, అలానే ఒక కంటైనర్ ను ఢీకొట్టింది. అదే సమయంలో బస్సు కూడా బోల్తా పడి మూడు పల్టీలు కొట్టింది. అదే సమయంలో కంటైనర్ కూడా అదుపుతప్పడం, కంటైనర్ కు లారీకి మధ్య క్వాలిస్ ఇరుక్కుపోయి, ఒక్కసారిగా అందులోని వారందరూ రోడ్ పై చెల్లాచెదురుగా ఎగిరి పడ్డారు. ఆ దెబ్బకు క్వాలిస్ నుజ్జు నుజ్జు అయి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా రక్తం సిక్తం అయింది.

ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది మృతి చెందగా 21మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెనువెంటనే గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్ళగానే అందులో గాయాలపాలయిన బాలుడు మృతిచెందాడు. పూర్తిగా నుజ్జు నుజ్జు అయినా క్వాలిస్, లారీ టైర్ల క్రింద ఇరుక్కుపోవడంతో అందులోని కొందరిని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. అయితే ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఘటనపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా చనిపోయిన వారంతా సంగారెడ్డి జిల్లా పెద్దమ్మ గూడెం గ్రామానికి చెందిన లక్ష్మణ్, అతని కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీస్ లు విచారణలో తర్వాత తెలిపారు. అలానే ఆసిఫాబాద్ కు చెందిన పంకజ్, సాయి నిఖిల్, సుశీల, మరియు చనిపోయిన చిన్నారి విజయ అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు…..

  •  
  •  
  •  
  •  

Comments