బిగ్ బాస్ : వారానికి రూ.50 లక్షల రెమ్యునరేష్?

Wednesday, September 5th, 2018, 07:29:43 PM IST

సల్మాన్ ఖాన్ మొదలు పెట్టిన బిగ్ బాస్ షో నార్త్ నుంచి సౌత్ జనాలకు గట్టిగా ఎక్కేసింది. పలు భాషల్లో ఈ రియాలిటీ షోకి అందుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగులో మొదటి షోతోనే ఊహించని విధంగా రెస్పాన్స్ అందుకుంది. రెండవ సీజన్ లో నాని కూడా బాగానే నడిపిస్తున్నాడు. ఇకపోతే బాలీవుడ్ బిగ్ బాస్ మొత్తం 11 సీజన్స్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా మంచి ఆదరణ అందుకుంటూ రేటింగ్స్ లో దూసుకుపోతోంది.

ఇక 12వ సీజన్ కి కూడా అంతా సిద్ధమైంది. అయితే సరికొత్తగా ఉండడం కోసం ఈ సారి జంటలుగా కంటెస్టెంట్ లు పాల్గొనబోతున్నారు. అసలు విషయంలోకి వస్తే ‘విచిత్ర జోడీస్’ అనే థీమ్ తో నడవనున్న ఈ కాన్సెప్ట్ లో పాల్గొనే కంటెస్టెంట్ ల వివారాలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెయిన్ గా రెమ్యునరేషన్ విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఒక సెలబ్రిటీ జంట బాలీవుడ్ నటి, కమెడియన్ భారతి సింగ్ ఆమె భర్త హార్ష్ లింబాచియాలు ఒక వీక్ కోసం ఏకంగా యాభై లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మరి సెప్టెంబర్ 16న ప్రారంబమయ్యే ఈ షో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments