బిగ్ బాస్ : కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ!

Sunday, September 9th, 2018, 04:15:11 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 మొదలైనప్పటి నుంచి ఏదైనా జరగవచ్చు అని నాని చెప్పిన మాటే నిజమవుతోంది. అయితే ఇప్పుడు ఎక్కువగా కౌశల్ కి అభిమానులు ఏర్పడుతున్నారు. పార్టిసిపెంట్ లలలో అందరూ ఒక వైపు అయితే కౌశల్ మరోవైపు ఉండడం ముందు నుంచి ఆసక్తిని రేపుతోంది. ఇక హౌస్ లో అందరూ కూడా అతన్ని టార్గెట్ చేయడం మొదటి నుంచి జరుగుతూనే ఉంది. కౌశల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో అతని అభిమానులు బారి మద్దతును కూడగడుతున్నారు.

ఇకపోతే రీసెంట్ గా మాదాపూర్ లో నిర్వహించిన 2కె రన్ లో కౌశల్ ఆర్మీ బలాన్ని నిరూపించుకుంది. ఇంకా ఫైనల్ కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో కౌశల్ ఆర్మీ టార్గెట్ చేస్తే ఎలాంటి వారైనా హౌస్ నుంచి వెళ్లిపోవాల్సిందే అని చెప్పకనే చెప్పింది. కౌశల్ తో ఓవరాక్షన్ చేస్తే ఆ ఎఫెక్ట్‌ వీకెండ్ లో కనిపిస్తోంది. కిరీటి, భాను శ్రీ, బాబు గోగినేని, దీప్తి సునయన, తేజస్వి, గణేష్, నందిని ఇలా వరుసగా ఎలిమినేట్ అవ్వడం చుస్తే క్లియర్ గా అర్ధమవుతోంది. మొన్నటి వరకు పెద్దగా పరిచయం లేని కౌశల్ కి ఇప్పుడు ఫ్యాన్స్ ర్యాలీ తో మరింత గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments