ఎనిమిదేళ్ల వేటకు ఎండ్ కార్డ్ పడింది!

Tuesday, July 10th, 2018, 03:09:25 PM IST

ప్రపంచంలో పొడవు ఎక్కువగా ఉన్న మొసళ్ల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ప్రతి జీవ రాశిలో ఎదో ఒక జాతి పెద్దదిగా ఉంటుంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియాలో దొరికిన ఓ మొసలి కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. దాని వయసు ప్రస్తుతం 60. అయితే గత 8 ఏళ్ల క్రితం ఓ సారి ఈ మొసలి ఫారెస్ట్ అధికారుల కంట పడింది. అప్పటి నుంచి దాని కోసం వారు వెతకని చోటు లేదు. వైల్డ్ లైఫ్ ఆపరేషన్స్ లో కేథరిన్ నది నుంచి భారీ సైజు గల క్రొకోడైల్ ను బంధించడం ఇదే మొదటిసారి.

ఈ ప్రాంతంలో ఎక్కువగా భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్న 250 మొసళ్లను బంధించామని అధికారులు తెలిపారు. ఇక ఎనిమిదేళ్ల తరువాత దొరికిన బారి మొసలిని జనావాసాలకు దూరంగా ఉంచి రక్షణ కలిపిస్తున్నట్లు తెలిపారు. 2010లో తొలిసారిగా ఈ మొసలి కనిపించిందట.దాపు 600 కిలోల బరువు అలాగే 4.7 మీటర్ల పొడవు కలిగిన ఇలాంటి ఉభయచరాలు చాలా అరుదుగా ఉంటాయని ఈ మొసలిని కేథరిన్ పట్టణ శివార్లలో ట్రాప్ చేసి పట్టుకున్నామని అధికారులు నేడు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments