ఇండోనేసియాలో భారీ భూకంపం!

Monday, August 6th, 2018, 09:54:38 AM IST

ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవిస్తాయి అనేది శాస్త్రవేత్తలు కొంతవరకు చెప్పగలిగినప్పటికీ, అటువంటి విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని మాత్రం ఖచ్చింతంగా అంచనా వేయడం కష్టమని వారు చెప్పిన సందర్భాలు లేకపోలేవు. ఇక భూకంపం, సునామి వంటివాటివల్ల కలిగే నష్టం నిజంగా అంచనా వేయడం కష్టమనేచెప్పుకోవాలి. ఇక విషయంలోకి వెళితే, ఇండోనేషియాలోని లంబాక్ ద్వీపములో సంభవించిన భారీ భూకంపంవల్ల దాదాపు 85 మంది మృత్యువాతపడగా, కొన్ని వేల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. వాస్తవానికి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఈ ప్రాంతం ఉండడంతో ఇక్కడ తరచుకూడా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇక్కడి టెక్టానిక్ పలకలు ఒకడైనినొకటి ఢీకొనడం వల్ల కూడా ఇటువంటి విపత్తులు సంబవిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

ఇక ప్రస్తుతం సంభవించిన ఈ భూకంపంవల్ల కొన్ని వందల భవనాలు దెబ్బతిన్నాయని, ఆ సమయంలో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఈ భూకంప తీవ్రత లేఖినిపై 7 గా నమోదయ్యిందని, ఒకరకంగా దీనివల్ల జరిగేనష్టం ఎక్కువే ఉంటుందని వారు అంటున్నారు. అయితే భూకంప కేంద్రం భూమిపైనుండి 10 కి. మీ. లోతులో ఉన్నట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే సంస్థవారు వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ భూకంప తీవ్రతకు దాదాపు 900 కి.మీ. దూరంలోని బాండుంగ్ నగరంలోనూ కొద్దిపాటి భూమి కూడా కంపించిందట. కాగా వరంరోజుల క్రితమే లంబాక్ లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించగా దాదాపు 20 మంది మరణించారు. దానివల్ల 300 ఇళ్ళు బాగా దెబ్బతిన్నాయట. కాగా అక్కడి అధికారులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments