కాలాకి దిమ్మ‌తిరిగే పంచ్‌!

Wednesday, May 30th, 2018, 10:38:39 PM IST


సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – ధ‌నుష్ -పా.రంజిత్ కాంబినేష‌న్ మూవీ `కాలా`పైనే జ‌నం క‌ళ్ల‌న్నీ. ఈ సినిమా జూన్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. అటు త‌మిళ‌నాడు, మ‌లేషియాలో ఈ చిత్రం అత్యంత భారీ క్రేజుతో రిలీజ‌వుతుంటే, తెలుగు రాష్ట్రాలు స‌హా క‌ర్నాట‌క‌లో ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇరుచోట్లా కాలాకు ప్ర‌తికూల ప‌రిస్థితులే ఏర్ప‌డ్డాయి.

త‌మిళ‌నాడు-క‌ర్నాట‌క మ‌ధ్య కావేరీ జ‌లాల వివాదం వ‌ల్ల కాలా రిలీజ్‌ని క‌న్న‌డిగ‌లు అడ్డుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే అక్క‌డ రిలీజ్ సందిగ్ధంలో ప‌డింది. ఇక‌పోతే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ప‌ర‌మైన చిక్కులొచ్చి ప‌డ్డాయి. నైజాం ఎవ‌రూ కొన‌లేదు. ఇక సీడెడ్‌, ఆంధ్రా బిజినెస్ పూర్త‌యింద‌ని వార్త‌లొచ్చినా.. చివ‌రి నిమిషంలో ఏమైందో డిస్ట్రిబ్యూట‌ర్ టోకెన్ అడ్వాన్స్‌ను వ‌దులుకుని సినిమానే వ‌ద్ద‌నుకున్నార‌ట‌. దాంతో నిర్మాత ధ‌నుష్ ఈ చిత్రాన్ని నైజాం స‌హా ఇటు ఏపీలోనూ రిలీజ్ చేసుకుంటున్నారు. అందుకు అగ్ర‌పంపిణీదారుడు ఎన్‌.వి.ప్ర‌సాద్ సాయం చేస్తున్నార‌ట‌. ఇక ఈరోజు కాలా ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. కానీ ఇలా అనూహ్యంగా డీల్ క్యాన్సిల్ అవ్వ‌డంతో ఈ ఈవెంట్ కూడా వాయిదా ప‌డింది. మొత్తానికి ధ‌నుష్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ప్లాన్ చేస్తున్నార‌ట‌.

  •  
  •  
  •  
  •  

Comments