ఓటుకు నోటు కేసు అఫిషియ‌ల్.. చంద్రబాబుకు ఊహించ‌ని షాక్..!

Friday, November 2nd, 2018, 02:36:55 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు తాజాగా మ‌రో ఊహించ‌ని షాక్ త‌గిలింద‌నే వార్త‌లు రాజ‌కీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. గ‌తంలో తెలంగాణ‌లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భాగంగా ఓటుకు నోటు కేసు తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో అప్పుడు ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపింది. అయితే ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణ‌రెడ్డి సుప్రీం కోర్టులో పిటీష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ శుక్ర‌వారం ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది.

ఈ నేప‌ధ్యంల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై రాజ‌కీయ క‌క్షతోనే కేసు వేశార‌ని..దీంతో ఈ కేసును విచార‌ణ‌లోకి తీసుకోవ‌ద్ద‌ని చంద్ర‌బాబు త‌రుపున న్యాయ‌వాది సిద్ధార్థ్ కోరారు. అయ‌తే నాటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఓ ఎమ్మెల్యేకి పెద్ద మొత్తంలో డ‌బ్బు ఇచ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించార‌ని, చంద్ర‌బాబు వాయిస్ రికార్డును కూడా ఫోరెన్సిక్ ధృవీక‌రించింద‌ని, త‌మ ద‌గ్గ‌ర వాటికి సంబంధించిన ప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌న్ కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఈ కేసును సీబీఐత‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని కోర్టును కోరారు ప్ర‌శాంత్ భూష‌న్. అయితే మ‌రోవైపు ఎన్నిక‌లు స‌మీపిస్తున్నందున ఈ కేసును విచార‌ణ‌కు స్వీక‌రించ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు త‌రుపు న్యాయ‌వాది సిద్ధార్థ్ కోరగా.. తోసిపుచ్చిన కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించి.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుండి విచారిస్తామ‌ని స్ప‌షం చేసింది. దీంతో చంద్ర‌బాబుకు పెద్ద షాకే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments