ప్ర‌కాశం టీడీపీకి బిగ్ షాక్ : వైసీపీలో చేరిక‌ను క‌న్ఫాం చేసిన ఎమ్మెల్సీ..!

Thursday, March 14th, 2019, 11:40:04 PM IST

మాగుంట ఫ్యామిలీ, ఏపీ రాజ‌కీయాల్లో ఈ ఫ్యామిలీ గురించి తెలియ‌ని వారంటూ ఎవరూ ఉండ‌రు. అంత‌లా ఒకొనాక స‌మ‌యంలో మాగుంట ఫ్యామిలీ రాజ‌కీయాలను శాసించింది. ప్ర‌స్తుతం ఆ కుటుంబం నుంచి మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి మాత్ర‌మే రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 2014 ఎన్నిక‌ల అనంత‌రం టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

అయితే, గ‌త కొన్ని రోజులుగా మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి టీడీపీని వీడ‌నున్నార‌ని, జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాన్ స‌మ‌క్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అవ‌న్నీ ట్రాష్ అని మాగుంట తానిచ్చిన ఇంట‌ర్వ్యూల్లో కొట్టిపారేశారు. అదే స‌మ‌యంలో మ‌రికొన్ని వెబ్‌సైట్‌లు వైసీపీలోకి మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి అంటూ క‌థ‌నాల‌ను ప్ర‌చురించాయి. జ‌న‌సేన‌లో చేరిక అవాస్త‌మ‌ని మీడియా ముందు చెప్పుకొచ్చిన మాగుంట వైసీపీలో చేరిక అంటూ ప్ర‌చురిత‌మైన క‌థ‌నాల‌ను ఖండించ‌లేదు. దాంతో వైసీపీలోకి మాగుంట జాయినింగ్ క‌న్ఫాం తేలిపోయింది.

అంద‌రూ అనుకున్న‌ట్టే మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి త‌న టీడీపీ స‌భ్యత్వానికి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఈ రోజు రాజీనామా చేశారు. దీంతో ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ కీల‌క నేత‌గా ఉన్న ఆయ‌నే రాజీనామా చేయ‌డంతో ఆ పార్టీకి బిగ్‌షాక్ త‌గిలిన‌ట్ల‌యింది. టీడీపీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా అనంత‌రం మాగుంట మీడియాతో మాట్లాడుతూ దివంగ‌త సీఎం వైఎస్ఆర్‌తో త‌న‌కు మంచి సంబంధం ఉంద‌ని, ఆ క్ర‌మంలోనే అతి త్వ‌ర‌లో వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.