రేవంత్ రెడ్డి కి బారి షాక్ – మాట తప్పిన నాయకురాలు

Wednesday, March 13th, 2019, 11:32:13 AM IST

ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా అంటుంది కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్ర రెడ్డి… కాంగ్రెస్ నేతలు ఎన్ని రకాలుగా బుజ్జగించినప్పటికీ కూడా వారికి చేదు అనుభవమే ఎదురవుతుంది. పార్టీ మరవద్దని కాంగ్రెస్ పెద్దలు చెప్పినప్పటికీ కూడా సబితా ఇంద్రారెడ్డి మనసు మాత్రం మారడం లేదు. అంతేకాకుండా సబితా ఇంద్రారెడ్డి మీ బుజ్జగించడానికి రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం శూన్యం. మొదట్లో రేవంత్ రెడ్డు మాట సబితా ఇంద్రరెడ్డి విన్నట్లు కనిపించినప్పటికీ కూడా ఫైనల్‌ గా సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్లడం ఖాయమైపోయింది.

తన తనయుడు కార్తీక్‌కు చేవెళ్ల టికెట్‌ కేటాయించే అంశంపై స్పష్టమైన హామీరాకపోవడమే పార్టీ మారడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు… కేవలం కొడుకు కోసమే తాను పార్టీ మారడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. వారికీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీటుతో పాటు చేవేళ్ల ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. కాగా ఇదే అవకాశంగా తీసుకున్న కెసిఆర్ మాత్రం సబితా కి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో వారిరువురు కూడా కారెక్కడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.