కాంగ్రెస్ కి పెద్ద షాక్ – తెరాస లోకి ముఖ్య నేత

Friday, March 15th, 2019, 09:43:20 PM IST

తెలంగాణాలోసార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది… కాంగ్రెస్ కి సంబందించిన మరో ముఖ్య నేత ఆ పార్టీ వీడి తెరాస లో చేరనున్నాడు… నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిశారు. ప్రగతి భవన్ లో ఆయన భేటీ అయ్యారు. ఈ నెల 16న శనివారం సీఎం కేసీఆర్ ను సుధీర్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఇవాళ ఉదయమే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ కి దెబ్బ మీద దెబ్బ తగలడంతో దిక్కు తోచని స్థితిలో పడుతుంది కాంగ్రెస్.