వైసీపీ కి షాక్ మీద షాక్ మరో ముఖ్య నేత రాజీనామా..ఆ పార్టీ లోకి జంప్!

Tuesday, November 6th, 2018, 05:27:57 PM IST

ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వారి పార్టీలోనే ఏ స్థాయిలో నిరసన సెగలు పుట్టుకొచ్చాయి వేరే చెప్పక్కర్లేదు.డబ్బులు ఎవరు అయితే ఎక్కువ ఖర్చు చేస్తారో వారికే ఎమ్మెల్యే సీట్లను కట్టబెడుతున్నారని,ఎన్నో ఏళ్లగా పార్టీకి పని చేసినటువంటి సీనియర్ నేతలకు కనీసం సంప్రదింపు లేకుండా వేరే వారికి సీట్లు ఇచ్చేస్తున్నారని పలువురు నేతలు మీడియా సమక్షంలో వారి ఆవేదనను వెళ్లగక్కుకున్నారు.నెల్లూరు జెడ్పీ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కూడా ఇదే కోవకి చెందుతారు.

ఎప్పటి నుంచో తాను వైసీపీ కి పని చేస్తున్నానని అలాంటి నాకు కనీసం చిన్న సమాచారం కూడా ఇవ్వకుండా వేరే ఎవరో 50 కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారని అతనికి జగన్ సీట్ కేటాయించారని సంచలనం సృష్టించారు.అప్పుడే విలువ లేని పార్టీలో తాను ఉండలేనని చెప్పి రాజీనామా చేస్తాను అని షాక్ ఇచ్చారు.ఈ రోజు అదే మాటని నిజం చేస్తూ వైసీపీ కి రాజీనామా చేసేసారు.అలా చెయ్యడమే కాకుండా తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్నట్టు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments