బిగ్ బాస్ షో వల్ల వాళ్లకు ఒరిగిందేమి లేదు!

Wednesday, May 23rd, 2018, 02:02:31 PM IST

బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలవుతుండగానే ఇప్పటివరకు హిందీ, మరియు ఇతరభాషల్లో ప్రసారమైన షో,ఇప్పుడు మన తెలుగులో రాబోతున్న ఈ షో ఎలా వుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. అతిహే అందరూ ఊహించినట్లుగానే ఆ షో కి హోస్ట్ గా ఎన్టీఆర్ ను తీసుకోవడం, కంటెస్టెంట్ లను కూడా జల్లెడపట్టి మరీ సెలెక్ట్ చేయడం చేసారు బిగ్ బాస్ టీం. షో ఆద్యంతం కూడా మంచి రేటింగ్ లతో, ఇంటరెస్టింగ్ అంశాలతో సాగింది. అయితే చివరకు ఈ షో పూర్తి కావడం, విజేతగా శివబాలాజీ నిలవడం జరిగాయి. షో సమయంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు అందరికి జనాల్లో మంచి గుర్తింపు రావడంతో, షో పూర్తికాకగానే దాదాపుగా అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించారు. వారిలో ముఖ్యంగా హరితేజ, శివబాలాజీ, ప్రిన్స్, నవదీప్, ఆదర్శ్ తదితరుల లైఫ్ బాగా టర్న్ అవుతుందని ఊహించారు. షో తర్వాత వీళ్ళు కొన్ని చానెల్స్ లో ఇంటర్వ్యూ లు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత నుండి ఏఒక్కరికి కూడా మంచి అవకాశం దక్కలేదు.

ఓ వైపు హరితేజ అక్కడక్క ఒకటి రెండు షోలకు యాంకరింగ్ చేస్తోంది, మరోవైపు నవదీప్ కూడా సినిమాలు లేక కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇక శివబాలాజీ కూడా ఖాళీగానే ఉన్నట్లు సమాచారం. ప్రిన్స్, ఆదర్శ్ లు అయితే ఎక్కడఉన్నారో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. ఇక కత్తి మహేష్ మాత్రం పవన్ వంటి సెలబ్రిటీ తో పెట్టుకుని విమర్శలతో మొదట్లో కొన్నాళ్ళు మీడియాలో నిలిచారు. కాగా ఆయన కూడా ప్రస్తుతం మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. భారీ ఆశలతో చేసిన బిగ్ బాస్ షో వల్ల కంటెస్టెంట్ లకు మంచి పారితోషికం అయితే ముట్టిందిగాని, ఎవరికీ ఎటువంటి గుర్తింపు, కానీ సరైన అవకాశాలు కానీ దక్కలేదనే చెప్పాలి. ఇక త్వరలో రానున్న రెండవ సీజన్ లో పాల్గొనేందుకు కంటెస్టెంట్ లు గా నటించేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, ఇక హోస్ట్ గా ఎన్టీఆర్ ని తీసేసి నాని తీసుకోవడం కూడా దీనికి ఒక ప్రధాన కారణమని గుస గుసలు వినిపిస్తున్నాయి…….

  •  
  •  
  •  
  •  

Comments