బిగ్ బాస్ 2 : మరోసారి టార్గెట్ అయిన కౌశల్.. తేజస్వి మళ్ళీ రానుందా?

Tuesday, July 24th, 2018, 09:53:23 AM IST

బుల్లితెర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 2 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా వీకెండ్ కి వచ్చేసరికి ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే ప్రతిసారి అందరూ కౌశల్ ని స్పెషల్ గా టార్గెట్ చేస్తుండడంతో హౌస్ లో వాతావరణం చాలా మారుతోంది. సోషల్ మీడియాలో అయితే కౌశల్ కి నిత్యం మద్దతు గట్టిగానే లభిస్తోంది. ఇకపోతే సోమవారం రాత్రి హౌస్ మేట్స్ కౌశల్ ని ఎలిమినేషల్ లో భాగంగా టార్గెట్ చేశారు.

అందరూ అతనిపై గుడ్లు కొట్టారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించడు. అతనెవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజు ఎపిసోడ్ లో అతను కనిపించనున్నాడు. ఇకపోతే నామినేట్ అయినవారిలో కౌశల్ తర్వాత బాబు గోగినేని, దీప్తి సునయన, గణేశ్ ఉన్నారు. అయితే ఓటిగ్ ద్వారా మొన్నటివరకు ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని మళ్ళీ బిగ్ బాస్ లోకి ఆహ్వానించనున్నట్లు బిగ్ బాస్ తెలిపాడు. తేజస్వి ని మరోసారి హౌస్ లోకి రప్పించడానికి ఈ ప్రయోగం చేస్తున్నారని సోషల్ మీడియాలో షో పై పలు కామెంట్స్ వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments