ఈసారి “బిగ్ బాస్” బాగానే ఉండేలా ఉంది..మరో ఆసక్తికర పేరు..?

Wednesday, June 5th, 2019, 10:22:33 AM IST

తెలుగులో బిగ్ బాస్ షోను ఫాలో అయ్యేవారికి మిగిలే ఏకైక అసంతృప్తి ఏదన్నా ఉంది అంటే అది ఆ షోలో పాల్గొనే పోటీదారుల విషయంలో అనే చెప్పాలి.మొదట్లో ఈ షో కు ఇచ్చిన హైప్ లో భాగంగా సెలెబ్రెటీలు అంటే ఎవరెవరో వస్తారు అని అంతా అనుకుంటే నిజంగానే ఎవరెవరో వస్తున్నారేంటి అని ఈ షోను చూడకుండా వదిలేసిన వారు కూడా అధికమే.ఇక్కడ ఈ షోను వీక్షించే వారి సంఖ్యకు దెబ్బ పడిందనే చెప్పాలి.కానీ ఈసారి జరగబోయే మూడో సీజన్లో మాత్రం అలా ఉండేందుకు అవకాశం లేదని తెలుస్తుంది.

ఎందుకంటే ఈసారి కాస్త తెలుగు ప్రేక్షకుల్లో బాగా తెలిసిన పేర్లు అలాగే బాగా ఎంటర్టైన్ చేసిన పేర్లు వినిపిస్తున్నాయి.ఇప్పటికే యాంకర్ శ్రీముఖి అలాగే వైవా హర్ష పేర్లు కూడా ఖరారు అయ్యాయి అని తెలిసింది.ఇప్పుడు తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది.అతనే ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్.ఎంతో మంది టాప్ మోస్ట్ హీరోలతో పనిచేసిన ఈయన పేరు చాలా మందికే తెలుసు.ఈయన కూడా ఈసారి బిగ్ బాస్ లో కనిపించనున్నారు అని తాజా సమాచారం.మొత్తానికి ఈసారి మాత్రం బిగ్ బాస్ మూడో సీజన్ బాగానే ఉంటుందని చెప్పాలి.అలాగే ఈ సీజన్లో హోస్ట్ గా కింగ్ నాగార్జున కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.