ఫ్లాష్ న్యూస్ : అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం!

Wednesday, April 11th, 2018, 05:55:44 PM IST

అల్జీరియాలో ఓ సైనిక విమానం హఠాత్తుగా నేలకొరిగింది. అల్జీర్స్ లోకి బౌఫారిక్ విమానాశ్రయం సమీపంలో ఈ విమానం ఒక్కసారిగా కూలిపోయినట్లు అక్కడి లోకల్ మీడియా తెలిపింది. అల్జీర్స్ నుండి బెచెర్ నగరానికి ఈ విమానం బయలుదేరిందని, అయితే ఆ విమానంలో దాదాపు 100 మందికి పైగా సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం కుప్పకూలిన వెంటనే నల్లని పొగలు దట్టమైన మంటలు రావడంతో స్థానికుల సమాచారంతో అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడం ప్రారంభించింది.

అయితే అసలు ప్రమాదం ఎందుకు జరిగిందో, దానికి గల కారణాలు, అలానే ప్రమాదంలో ఎంతమంది మరణించారు అనేదానిపై ఇంకా నివేదిక రావలసిన ఉందని అక్కడికి చేరుకున్న అత్యవసర విభాగ అధికారులు చెపుతున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు…..

  •  
  •  
  •  
  •  

Comments