వీడియో : బార్ గర్ల్ తో లీడర్ రొమాన్స్.. పదేళ్ల పరువు పది నిమిషాల్లో దొబ్బింది!

Monday, March 19th, 2018, 11:21:18 AM IST

ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే పనులు ఎలాంటి వివాదాలను సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో గాని ఏళ్ల తరబడి సంపాదించుకున్న పేరును అయిదు నిమిషాల్లో నాశనం చేసుకుంటారు. రీసెంట్ గా అదే తరహాలో ఒక పార్టీ సీనియర్ నాయకుడు బార్ గర్ల్ తో రొమాన్స్ చేసి పదేళ్ల నుంచి కష్టపడి తెచ్చుకున్న పేరును పది నిమిషాల్లో సర్వ నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ న్యూస్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కు బీహార్ లో మంచి గుర్తింపు ఉంది.

అయితే అక్కడ కీలక నేతగా ఉన్న అరుణ్ దాదుపురి ఫతేపూర్ లో ఒక వివాహానికి హాజరయ్యారు.
అక్కడ పెళ్లి వారు సింపుల్ గా ఒక బార్ డ్యాన్సర్ తో ప్రోగ్రాం ఏర్పాటు చేయగా అరుణ్ దాదుపురి లైవ్ లో రొమాన్స్ చేసి ఐటెమ్ సాంగ్ ని తలపించాడు. నోట్లను ఆమెపై జల్లుతూ.. ఇష్టం వచ్చినట్లు చిందులు వేశాడు. ఆ తరువాత ఇష్టానుసారంగా ఆమెను ఎత్తుకొని చిందులేశాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అరుణ్ దాదుపురి పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. స్థానిక ప్రజలే అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు. అరుణ్ దాదుపురి మొన్నటి వరకు మంచివాడని బుద్ధిమంతుడని అనుకున్నాము కానీ ఇలాంటి వాడని తెలియదని కామెంట్స్ చేస్తున్నారు.