విచిత్ర ప్రేమ గాధ : ప్రియుడి కోసం కిడ్నీ అమ్మాలనుకున్న యువతి..!

Wednesday, October 18th, 2017, 12:05:39 PM IST

తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి బీహార్ కు చెందిన 21 ఏళ్ల యువతి తన కిడ్నీ సైతం అమ్ముకోవడానికి సిద్ద పడింది. వివరాల్లోకి వెళితే ఆ యువతికి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. భర్త తో విభేదాల కారణంగా పుట్టింటికి తిరిగి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులకు తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. కానీ అందుకు వారు నిరాకరించారు. ప్రియుడితో కలసి వెళ్లిపోయి వివాహం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది.

ఈ విషయాన్ని ప్రియుడి వద్ద ప్రస్తావించగా అతడి కట్నం లేనిదే వివాహం జరగదని తెగేసి చెప్పేశాడు. డబ్బు పిచ్చి ఉన్న అతడిని నమ్మి తన కిడ్నీ సైతం అముకోవడానికి సిద్ద పడింది ఆ అమాయకురాలు. వివాహానికి అంగీకరించని తల్లిదండ్రులు అంత డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. దీనితో కిడ్నీ అమ్మితే ధనం సమకూరుతుందని ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. కిడ్నీ దానం చేయడానికి వచ్చానని చెప్పడంతో వైద్యులకు అనుమానం వచ్చి పోలీస్ లకు సమాచారం అందించారు. పోలీస్ లు ఆమెని వివిచారించగా అసలు విషయం బయట పడింది. దీనితో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీస్ లు తన బలహీనతని ఆధారంగా చేసుకుని కట్నం అడిగిన ప్రియుడిపై కేసు పెట్టాలని కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments