చంద్రబాబు ను మెచ్చిన బిల్ గేట్స్

Tuesday, January 9th, 2018, 11:24:03 AM IST

ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త , మైక్రోసాఫ్ట్ అధినేత అయినా బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పనితనాన్ని గొప్పగా కొనియాడారు . ఆయన ఒక లేఖను చంద్రబాబు కు పంపారు . ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు తో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది, ఇటీవల నిర్వహించిన అగ్రిటెక్ సదస్సు చంద్రబాబు దూర దృష్టి కి అద్దంపడుతుందని లేఖలో ఆయన పేర్కొన్నారు వ్యవసాయం లో రాష్ట్రాన్ని ఒక ఇన్నోవేటివ్ హబ్ గా తీర్చిదిద్దెందుకు చంద్రబాబు పడుతున్న కృషి, శ్రమ ఎనలేనిది అని ముఖ్యంగా ఆయన పేర్కొన్నారు .

భూసార పరీక్షల మాపింగ్ తో పాటు వ్యవసాయ నూతన విధానాలను రైతులకు చేరవేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు . ఆరోగ్య రంగం లో చంద్రబాబు చేపడుతున్న సంస్కరణలు , పొరుగు సేవల విధానం లో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అమలు విధానానికి కితాబిచ్చారు . అధిక శాతం ప్రజలకు భీమా సౌకర్యం కల్పించడం లో ఆంధ్రప్రదేశ్ యావత్ భారత దేశంలోనే ముందంజ లో వున్న విషయాన్ని తాను తెలుసుకున్నాను అన్నారు . అంతేకాక ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకోవాలని , ఈ విధమైన నూతన సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని ఆయన అన్నారు .