అమెరికాలో హెచ్-1 బి వీసాల పెంపుకు బిల్లు !

Friday, January 26th, 2018, 08:50:59 PM IST


అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హెచ్-1బి వీసాల సంఖ్యను పెంచాలని కోరుతూ అక్కడి సెనేట్ లో ఒక బిల్లు ను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతిభావంతులని అమెరికా కు రప్పించాలని ఉద్దేశ్యంతోనే ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు ఒర్రిన్ హాచ్, జెఫ్ ఫ్లేక్ ఇమ్మిగ్రేషన్ ఇన్నోవేషన్ ఆక్ట్ 2018 పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థతో అమెరికా పోటీ పడేందుకు ఈ బిల్లు ప్రతిపాదనలు ఉన్నాయని సెనేటర్లు హాచ్, ఫ్లేక్ అన్నారు. ఈ బిల్లు ద్వారా హెచ్-1 బి వీసాదారుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు వర్క్ పర్మిట్ కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ వీసాదారులు ఉద్యోగం మారేందుకు తగిన సమయం కల్పించాలని భావించారు. అలానే ఈ బిల్లుకు ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, అమెరికన్ ఛాంబర్ అఫ్ కామర్స్, అక్కడి ప్రముఖ ఐటి కంపెనీలు, ఐటి ఇండస్ట్రీ కౌన్సిల్ సహా పలు వాణిజ్య సంఘాల మద్దతు లభించడం శుభసూకచకం అంటున్నారు. అమెరికన్ ఉద్యోగుల కొరత వున్న చోట ఈ హెచ్-1 బి వీసాలు ప్రతిభావంతులయిన ఉద్యోగులను కంపెనీలకు అందిస్తున్నాయని, మోసపూరిత ఉద్యోగులను నియంత్రించేలా చేస్తున్నాయన్నారు. ఈ బిల్లు లో ప్రధానంగా హెచ్-1 బి వీసాల సంఖ్యను 65 వేల నుండి 85 వేలకు పెంచేలా ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతిభావంతుల వలసలు దేశానికి లాభం అందిస్తాయని, అయితే దీనిని ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఉపయోగించొద్దని, తద్వారా అమెరికన్ల జీతాలు తగ్గేలా చూడొద్దన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments