చైనా బలమైనదే.. కానీ భారత్ బలహీనమైన దేశం కాదు!

Friday, January 12th, 2018, 04:04:22 PM IST

గత కొంత కాలంగా చైనా ప్రవర్తిస్తోన్న తీరు భారత్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్ని సార్లు అక్కడి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపినా కూడా చైనా ఏ మాత్రం తగ్గడం లేదు. చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాం అంటూనే మళ్లీ వంకర బుద్దిని చూపిస్తోంది. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడడమే కాకుండా ఇంకా మాటలతో రెచ్చగొట్టడానికి ప్రయత్నాలను చేస్తోంది. అక్కడి మీడియా కూడా అందుకు పన్నాగం పన్నుతోంది. అయితే చైనా ఎన్ని ఎత్తులు వేసినా భారత ఆర్మీ కూడా గట్టిగా స్పందిస్తోంది. ఏ మాత్రం ఆలోచించకుండా మాటకు మాట జవాబును ఇస్తోంది.

అయితే భారత్ కు వీరోధిగా ఉన్న పాకిస్థాన్ తో గత కొంత కాలంగా చైనా స్నేహాన్ని పెంచుకుంటోంది. ఆ దేశాన్ని భారత్ పై ఉసిగెలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మిగతా దేశాలలో కూడా భారత్ పై చెడు ప్రచారాన్ని చేస్తోంది. తమ దేశ సైన్యం భారత్ కంటే చాలా బలంగా ఉందని పదే పదే చెబుతుండడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంపై ఇటీవల ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ చైనాకు గట్టిగా కౌంటర్ వేశారు. చైనా ఎన్ని కుట్రలు పన్నినా భారత్ ను ఏం చేయలేదు. చైనా చాలా బలమైంది కావచ్చు. కానీ భారత్ మాత్రం బలహీనమైన దేశం కాదని తెలియజేశారు. అంతే కాకుండా తూర్పు దేశ సరిహద్దులపై చైనా సరిహద్దు ఉల్లంఘనకు పాల్పడుతోందని, భారత భూభాగంలోకి అడుగుపెడితే.. ఇండియా అస్సలు ఊరుకోదని బిపిన్‌ రావత్‌ మరోసారి గుర్తు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments