మోడీ జన్మదిన వేడుకలు రద్దు

Monday, September 15th, 2014, 10:22:43 AM IST


భారత ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 17న తన జన్మదిన వేడుకలను నిర్వహించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.అలాగే జమ్మూ కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరిన మోడీ, తన జన్మదినానికి ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించొద్దని విజ్ఞ్యప్తి చేశారు. ఇక కాశ్మీర్ ప్రజలను ఆదుకోవాలని తన ట్విట్టర్ అకౌంట్ లో మోడీ విజ్ఞ్యప్తి చేసి, ఆడంబరాలు మాని ఆపదలో ఉన్న వారికి సహాయంగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే తన జన్మదినాన్ని పురస్కరించుకుని తన స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని కోరారని, అయితే తాను వారిని వారించానని మోడీ వివరించారు. ఇక తన జన్మదిన వేడుకలకు చేసే ఖర్చు మొత్తాన్ని కాశ్మీర్ వరద బాధితులకు సహాయార్ధం వినియోగించాలని మోడీ విజ్ఞ్యప్తి చేశారు.