నటుడు శివాజీపై బిజెపి నేతల దాడి!

Wednesday, May 16th, 2018, 11:26:45 PM IST

కొద్దిరోజులుగా ప్రత్యేక హోదా ఉద్యమంపై తనవంతుగా పోరాడుతున్న నటుడు శివాజీ, విభజన హామీలు హోదా అంశంపై మోసం చేసిన ఎన్డీయే నేతృత్వంలోని బిజెపిని ఉద్దేశించి పలు విమర్శలు గుప్పిస్తున్నారు. తన సొంత రాష్ట్రం సహా పక్క రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్న మోడీకి ఏపీ ఒక నష్టపోయిన రాష్ట్రంగా, అభివృద్ధికి నోచుకోని రాష్ట్రంగా కనిపించడంలేదా అని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. ఇటీవల విజయవాడలో హోదాపై జరిగిన చర్చ కార్యకమంలో బిజెపి నేతలు శివాజీపై దాడికి యత్నించారుకూడా. కాగా నేడు గన్నవరం విమానాశ్రయంలో కూడా ఆయన పై మరోసారి బీజేపీ నేతలు దాడి చేయబోయారు. విషయం ఏమిటంటే, ఏపీ బిజెపి రాష్ట్ర అద్యక్షుకుడుగా ఎన్నికైన కన్నలక్ష్మి నారాయణ ఢిల్లీ నుండి వస్తున్న శుభ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం తెలిపేందుకు బీజేపీ నేతలు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు.

అదే సమయంలో అనూహ్యంగా నటుడు శివజి కూడా అదే విమానంలో హైదరాబాద్ నుండి గన్నవరం చేరుకోవడంతో ఆ ఎయిర్పోర్ట్ లో శివాజీని చూసిన బిజెపి నేతలు ఒక్కసారిగా ఆగ్రహించి, మా మోడీని, బిజెపిని కించపరిచిన నిన్ను వదిలేది లేదని పలువిధాలుగా ఆయను దుర్భాషలాడి, దాడిచేయడానికి ప్రయత్నించారు. కొద్దిసేపు విపరీతమైన తోపులాట జరగడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది శివాజీని వెంటనే ఆయన కారులో ఎక్కించి పంపించేశారు. ఆ సమయంలో బిజేపినేతలు జై మోడీ నినాదాలతో ఎయిర్పోర్ట్ మొత్తం హోరెత్తించారు. తమ తప్పులను వేలెత్తి చూపినందుకు తన పై దాడికి యత్నించడం బిజెపి నేతలకు సరికాదని, ఇలాంటి భౌతిక దాడులవల్ల నష్టమే తప్ప లాభముండదని మీడియాతో శివాజీ అన్నారు……..