బీజేపీ – కేసీఆర్ సీక్రెట్ డీల్?!

Tuesday, November 6th, 2018, 03:50:55 PM IST

తెలంగాణ‌లో బీజేపీ పాగా వేయాల‌ని చూస్తోంది కానీ అది అంత ఈజీగా జ‌రిగే ప‌నికాదు. దానికి కార‌ణం తెలంగాణ రాష్ట్ర‌స‌మితి అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు. ఆయ‌న్ని కాద‌ని తెలంగాణ‌లో బీజేపీ పాగా వేయ‌డం అసాధ్య‌మే. ఇది బీజేపీ జాతీయ నాకుడైన అమిత్‌షాకు, ప్ర‌దాని న‌రేంద్ర మోదీకీ తెలుసు. తెలంగాణ‌లో పార్టీని కాపాడుకోవ‌డంలో విఫ‌లం అవుతున్న విష‌యం తెలిసినా కేసీఆర్‌తో పెట్టుకోవ‌డానికి భ‌య‌ప‌డుతున్నార‌ట‌.

గ‌త కొంత కాలంగా నోట్ల ర‌ద్దు నుంచి కేసీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ద్ద‌తుగా వుంటూనే త‌నకు కావాల్సిన ప‌నుల్ని, విభ‌జ‌న చ‌ట్టంలో నెర‌వేర్చ‌కుండా పెండింగ్‌లో పెట్టిన ఒక్కొక్క అంశాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటూ వ‌స్తున్నారు కేసీఆర్‌. వీరిద్ద‌రి మ‌ధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింద‌ని, అందుకే కేసీఆర్ చెప్పిన‌వ‌న్నీ మోదీ ట‌క‌ట‌కా చేసేస్తున్నార‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఆ వాదానికి బ‌లాన్ని చేకూరుస్తూ కేసీఆర్ త‌ను నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో స‌భ‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీకే ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు కురిపిస్తుండ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఊహాగానాల మాట అటుంచితే కేసీఆర్‌తో దోస్తీ మొద‌టికే మోసమ‌ని, ఆ పార్టీకి దూరంగా వుంటేనే మంచిద‌ని పార్టీ శ్రేణులు సీనియ‌ర్‌ల‌కు సూచిస్తున్నాయ‌ట‌. ఓ ప‌క్క మాజీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డిని విమ‌ర్శిస్తూనే కేసీఆర్ అత‌న్నిత‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం రాష్ట్ర బీజేపీ శ్రేణుల‌తో పాటు జాతీయ నాయ‌కుడు అమిత్ షాకు కూడా మింగుడు ప‌డ‌టం లేద‌ట‌.

  •  
  •  
  •  
  •  

Comments