ఓవైసీ కోసం బీజేపీ కొత్త స్కెచ్‌

Tuesday, October 9th, 2018, 02:55:18 PM IST

పాతిబ‌స్తీలో బీజేపీకి త‌ల‌నొప్పిగా మారిన మ‌జ్లీస్ నాయ‌కుడు అస‌దుద్దీన్ ఓవైసీ. అత‌న్ని ఎలాగైనా ఈ సారి చిత్తు చేయాల‌ని బీజేపీ అధినాయ‌క‌త్వం పావులు క‌దుపుతోంది. రాజ‌కీయంగా ఓవైసీకి షాకివ్వాల‌ని కొత్త ఎత్త‌ల్లో భాగంగా అత‌నికి పోటీగా మొత్తానికి ఓ అభ్య‌ర్థిని రంగంలోకి దింపింది. ఓవైసీ ప్ర‌తినిధ్యం వ‌హిస్తున్న చాంద్రాయ‌ణ గుట్ట నుంచి బీజేపీ త‌రుపున ష‌మ‌జాదీ అనే ఓ మ‌హిళ‌ను పోటీకి దింపేసింది. అక్బ‌రుద్దీన్ ఓవైసీని ఢీకొనే మ‌హిళ అంటూ ప్ర‌స్తుతం ష‌హ‌జాదీ వార్త‌ల్లో నిలుస్తోంది.

ఉస్మానియాలో ఎంఏ పాలిటిక్స్ చేసిన ష‌హ‌జాదీకి ఎలాంటి రాజ‌కీయ నేప‌థ్యం లేక‌పోవ‌డం ఓవైసీకి బ‌లంగా మారే అవ‌కాశం వుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే మ‌తాన్ని ఆస‌రాగా చేసుకుని పాత‌బ‌స్తీ యువ‌త‌ను ఓవైసీ సోద‌రులు అభివృద్ధికి దూరంగా వుంటుతున్నార‌ని షహ‌జాదీ ఆలోచ‌నాత్మ‌క ప్ర‌చారం మొద‌లుపెట్టింది. ఇన్నేళ్లుగా పాత‌బ‌స్తీని అడ్డుపెట్టుకుని ప‌బ్బం గ‌డుపుకుంటున్న ఓవైసీ సోద‌రులు ముస్లీమ్‌ల ఉన్న‌తి కోసం ఏం చేశారో చెప్పాల‌ని స‌వాల్ చేస్తోంది. దీంతో ఓవైసీ ఓట‌మి ఖాయం అని అంతా అంటున్నారు.

పాతబ‌స్తీకి చెందిన ముస్లిమ్ యువ‌తుల‌ను అర‌బ్ షేకులు అంగ‌ట్లో స‌రుకుల్లా కొనుక్కుపోతూ అమ్మేస్తుంటే ఓవైసీ ఎందుకు ఇన్నాళ్లు మౌనంగా వున్నాడో చెప్పాలని ప్ర‌శ్నిస్తుండ‌టంతో ఆమెకు మ‌హిళ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ట‌. ట్రిపుల్ త‌లాక్ ని ర‌ద్దు చేయాల‌ని ముస్లం మ‌హిళ‌లు ద‌శాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్నారు. దీన్ని పాకిస్తాన్‌, బాంగ్లాదేశ్ వంటి ముస్లీమ్ దేశాల్లో ఇప్ప‌టికే ర‌ద్దు చేస్తే ఇక్క‌డ మాత్రం అది త‌ప్పంటూ ఓవైసీ ప్ర‌చారం చేస్తున్నాడు. ఇలాంటి నాయ‌కుడు మ‌నకు అవ‌స‌ర‌మా? అని ష‌మ‌జాదీ నిల‌దీయడంతో అక్బ‌రుద్దీన్‌కు చెక్ పెట్టేందుకు ష‌హ‌జాదీని ఎంచుకుని క‌రెక్ట్ రిర్ణ‌యం తీసుకున్నామ‌ని బీజేపీ శ్రేణులు సంబ‌ర‌ప‌డుతున్నాయి.