సిద్దరామయ్య నీ పని అయిపొయింది : అమిత్ షా

Saturday, April 28th, 2018, 03:49:35 PM IST

ఎన్నికల సమయానికి దగ్గర పడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందన్నగట్టి నమ్మకంతో బీజేపీ చీఫ్ అమితా షా కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రభుత్వంపై ఓ కన్నేసి ఉంచారు. సిద్దరామయ్య ప్రభుత్వం అంతానికి కౌంట్‌డౌన్ మొదలైంది అన్నారు. ఇక ఆయన పని అయిపొయింది అన్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం రెండు రోజుల పర్యటనకు షా కర్ణాటకకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా తన రెండో రోజు పర్యటనలో భాగంగా కొన్ని పబ్లిక్ ర్యాలీలలో తిరిగి వచ్చారు. అంతకుముందు ఆయన కుందాలసంగామలో ఉన్న బసవేశ్వర ఐక్య స్థలను సందర్శించి ప్ర్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాగల్‌కోట్‌లో నిర్వహించిన సభలో ఆయన ఉపన్యసించారు.

ఇదిగో “సిద్దరామయ్యా.. నీ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మేము కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఇప్పటి వరకు 12 రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇక.. కర్ణాటకలోనూ దాని అంతానికి చివరి రోజులు దగ్గరపడ్డాయి. సిద్దరామయ్యను కాంగ్రెస్ బదామి నుంచి పోటీచేయాలని బలవంత పెడుతున్నది. అయితే.. బదామిలో సిద్దరామయ్య ఖచ్చితంగా ఓడిపోక తప్పదు. సిద్దరామయ్యా.. నేను నిన్ను అభ్యర్థిస్తున్నాను.. ఈసారి బీఎస్ యడ్యూరప్పకు అవకాశం ఇస్తే.. ఆయన కర్ణాటకను నెంబర్ వన్ రాష్ట్రంగా చేసి చూపిస్తాడు. ఇది తథ్యం, నేను కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో తిరిగాను. ఎక్కడ చూసినా జనాల్లో బీజేపీపై అదే ఉత్సాహం, అదే నమ్మకం కనిపిస్తున్నది..” అని అమిత్ షా పర్యటనా సభలో ప్రసంగించారు. అయితే ప్రస్తుతం కర్ణాటకలో మొత్తం 224 ఎమ్మెల్యే సీట్లకు మే 12న పోలింగ్ కాగా.. మే 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి, ఇక గెలుపెవరిదన్న విషయం కోసం వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments