ఆర్‌బీఐ మ‌టాష్‌.. దేశం ఆర్థిక సంక్షోభంలోకి!?

Wednesday, November 7th, 2018, 11:52:05 AM IST

దేశంలోని కీల‌క సంస్థ‌ల్ని ద‌శ‌ల వారీగా నిర్వీర్యం చేస్తూ వ‌స్తున్న బీజేపీ క‌న్ను ఇప్ప‌డు మ‌రో కీల‌క సంస్థ‌పై ప‌డింది. దేశ ఆర్థిక ప‌టిష్ట‌త‌కు గ‌త కొన్నేళ్లుగా పాటుప‌డుతున్న దేశ కీల‌క ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా పేరున్న ఆర్‌బీఐని నాశ‌నం చేయాల‌ని బీజేపీ ప్యూహం ప‌న్నిన‌ట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఈ వార్త మేధావవుల‌ని ఉలికి పాటుకు గురిచేస్తోంది. ఎన్డీయే కూట‌మి నుంచి న‌రేంద్ర‌మోదీ ప్ర‌ధానిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత నుంచే దేశంలోని కీల‌క వ్య‌వ‌స్థ‌ల నాశ‌నానికి బీజం ప‌డింద‌ని, అందులో భాగంగానే తొలుత ప్ర‌ణాళికా సంఘాన్ని ర‌ద్దుచేసి దేశ ప్ర‌జ‌ల‌కు, మేధో వ‌ర్గానికి విస్మ‌యానికి గురిచేశాడు మేదీ.

ఆ త‌రువాత నుంచి కీలక‌ వ్య‌వ‌స్థ‌ల్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తూ దేశం నివ్వెర‌పోయేలా చేస్తున్న ఎన్డీయే క‌న్ను ఇప్పుడు ఆర్‌బీఐపై ప‌డింద‌ని, ఈ సంస్థ‌లో మిగులుగా వున్న 3.6 కోట్ల మొత్తాన్ని త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌న్న ప్ర‌ధాన వ్యూహంతోనే ఆర్‌బీఐని బీజేపీ నిర్వీర్యం చేయాల‌నే ప‌న్నాగం ప‌న్నింద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకు స‌హ‌క‌నించ‌ని ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌ ఉర్జిత్ ప‌టేల్‌పై లేనిపోని విమ‌ర్శ‌ల‌కు దిగుతూ అత‌డిని రాజీనామా చేయ‌ల్సిందిగా ఒత్తిడి చేస్తోంద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఆర్‌బీఐని నిర్వీర్యం చేస్తే దేశ ఆర్థిక మూల‌లాకు పెద్ద ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని, అదే జ‌రిగితే దేశం అధోగ‌తి పాల‌వ‌డం ఖాయ‌మ‌ని, ఆర్‌బీఐ సొమ్మును కాజేస్తే అదే దేశ చ‌రిత్ర‌లో అతిపెద్ద కుంభ‌కోణం అవుతుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు బీజేపీపై మండిప‌డుతున్నారు. స్వ‌యం ప్ర‌తిప‌త్తిగ‌ల సంస్థ‌ను నిర్వీర్యం చేసి అందులో వున్న సొమ్మును ద్ర‌వ్య‌లోటును పూడ్చ‌డం కోసం వినియోగించాల‌ని బీజేపీ ప్ర‌భుత్వం చూస్తోంద‌ని, అర్జెంటీనా త‌ర‌హా రాజ్యాంగ సంక్షోభం త‌ప్ప‌ద‌ని రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చిక‌లు చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.