గెస్ట్ హౌస్ లో మైనర్ బాలిక పై హోమ్ మినిస్టర్ అత్యాచారం..?

Sunday, January 29th, 2017, 02:28:37 PM IST

rap-reu-759
మేఘాలయ హోమ్ మంత్రి డొంకూపర్ రాయ్ పై 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ ఘటన మరువక ముందే మరో సంచలన విషయం బయటకు వచ్చింది.షణ్ముగ నాథన్ రాజ్ భవన్ లో లేడీస్ క్లబ్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం మేఘాలయ గవర్నర్ 14 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసాడని బిజెపి ఆరోపిస్తోంది. ఆయన ని మంత్రి పదవి నుంచి వెంటనే బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది.

హోమ్ మంత్రి తనయుడు షిల్లాంగ్ లో ఓ గెస్ట్ హౌస్ నిర్వహిస్తున్నాడు. ఆ గెస్ట్ హౌస్ లో హోంమంత్రి సహా నలుగురు కలసి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపించడం తో బీజీపీ మండిపడుతోంది. కాగా హోమ్ మంత్రిమాత్రం తాను ఏ తప్పు చేయలేదని రాజీనామా చేసే ప్రసక్తే లేదని అంటున్నారు. గవర్నర్ విషయాన్ని రాజకీయం చేసిన రాజకీయ నాయకులూ, హోమ్ మంత్రిని ఎందుకు వెనకేసుకొని వస్తున్నారని బిజెపి ప్రశ్నిస్తున్నారు.