షాకింగ్ న్యూస్ : చక్రం తిప్పబోతున్న బీజేపీ… రేవణ్ణ బరిలో దిగానున్నాడా..?

Wednesday, May 16th, 2018, 01:15:18 AM IST

గంట గంటకీ కర్ణాటక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. కర్ణాటక సీటుపై ఎవరెక్కి కూర్చుంటారా అంశంపై ప్రతీ నిమిషం ఒక యుగంలా గడుస్తున్నది. రాష్ట్రంలో కొట్టుకుపోతాడనుకున్న జేడీఎస్ పార్టీ అధినేత కుమార స్వామి ఏకంగా రాజ్యమేలటానికి సిద్దమవ్వబోతున్నాడు. ఇక్కడ బీజేపీకి 104 స్థానాలూ, ఎక్కడ కాంగ్రెస్ కి 78 స్థానాలూ, ఎక్కడ జేడీఎస్ కి 38 స్థానాలు. విచిత్రం కాకపొతే నిద్రలోంచి లేచి నక్క తోక తొక్కినట్టు, ఎక్కువ స్థానాలు ఉన్నవారేమో అయోమయంలో పడ్డారు. తక్కువ స్థానాలు పొందిన కుమారా స్వామీ ఏమో సీఎం కుర్చీ ఎక్కబోతున్నాడు. ఈ రోజు ఉదయం నుండి ఎన్నికల కమిటీ విడుదల చేస్తున్న ఫలితాల జాబితాలో కేవలం చిన్నపాటి తేడాతో ఆశ్చర్యగోలిపే అంకెలతో ఇమిడి ఉన్న 112 స్థానాల్లో సంయుక్త కాంగ్రెస్ జేడీఎస్ లు ఉంటే ఇంకొంచెం దూరంలో 104 స్థానాల్లో బీజేపీ ఆగిపోవడం నిజంగా రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త కోణం అని చెప్పుకోవాలి. ఈ సమయం కాంగ్రెస్ కు అనుకూలంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుండి చక్రం తిప్పి యావత్ భారతదేశాన్ని కంగు తినిపించింది. దెబ్బకి దేవ గౌడ నలుగురి నడుమ నందిలా నిలుచున్నాడు.

రాజకీయ దర్శకురాలు అయిన సోనియా గాంధీ ధిల్లీలో తీసిన కర్ణాటక రాజకీయం అనే సినిమాలో కుమారా స్వామిని హీరోని చేసింది. సినిమా క్లైమాక్స్ కి రాకముందే కథ అడ్డంగా తిప్పేసింది. మూడింటిలో ఎ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ ఎలాగైనా నిలువునా తొక్కేసి కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి అధికారం దక్కనీయకుండా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసింది. రాష్ట్రంలో జేడీఎస్ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమ సంపూర్ణ మద్దతిస్తామని కుమార స్వామికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీతో రహస్య మంతనాలు చేసిన కుమార స్వామి ఈ ప్రతిపాదనకు సై అన్నాడు. కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇప్పుడు భాజాపా ఒక కొత్త వ్యూహాన్ని సృస్టించనున్నది. ఇందులో గనక బీజేపీ ప్లాన్ విజయవంతమైందంటే కాంగ్రెస్ కోట పటా పంచాలవ్వాల్సిందే. విషయానికొస్తే జేడీఎస్ లో 12 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆహర స్థానంలో ఉన్న దేవగౌడ మొదటి కొడుకు రేవణ్ణకు భాజాపా పెద్ద వలనే వేసేందుకు యోచించింది. రేవణ్ణ జేడీఎస్ ను రెండుగా చీల్చి భాజాపాలో చేరితే ఆయన తరపున ఉన్న 12 ఎమ్మెల్యేలు అతని వెంటే వస్తారు, అంతే కాకుండా రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి కూడా సిద్దపదినట్టు సమాచారం. భాజాపా వేసిన ఈ ప్లాన్ గనక విజయవంతం అయిందంటే ఇక కాంగ్రెస్ కు కష్టాలు తప్పవన్నట్టే.

Comments