బీజేపీ విభజించు పాలించు అనే సిద్దాంతాన్ని పాటిస్తుంది : మంత్రి సోమిరెడ్డి

Wednesday, March 14th, 2018, 03:46:52 AM IST

గత కొద్ది రోజులుగా కేంద్రం తీరుపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. అయితే రాష్ట్రాన్ని మళ్లీ విడగొట్టేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ సిపీ రాష్ట్రానికి చాలా ద్రోహం తలపెట్టనుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాల సిద్దాంతాన్ని భాజాపా మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నంలో ఉందని నమ్మించి గొంతు కోసే ఆలోచనలు బీజేపీ దగ్గర చాలా ఉన్నాయని అన్నారు. తాము చెప్పినట్టు చేయకుంటే రాష్ట్రాన్ని విడదీస్తామన్నట్టుగా బీజేపీ మాట్లాడుతోందన్నారు. మోదీపై విశ్వాసం, మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం… ఇదీ వైకాపా తీరు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్ధిక నేరగాళ్లయిన పార్టీ అధినేతలకు ప్రధాని మోదీ వాళ్ళని కలవడానికి సమయం ఎలా కేటాఇస్తారని సోమిరెడ్డి ధ్వజమెత్తి ప్రశ్నించారు. జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టే నీరవ్ మోదీకి కూడా ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఉత్తర, దక్షిణ భారతదేశం అనడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపొద్దని మాత్రమే తాము కోరుతున్నామన్నారు. దయచేసి తమకి మంచి చేయకపోయినా సరే కాని చెడు చేసే ప్రయత్నాలు చేయవద్దని సోమిరెడ్డి వాపోయారు.

  •  
  •  
  •  
  •  

Comments