అభివృద్ధికే మహాప్రజలు పట్టం

Sunday, October 19th, 2014, 10:00:02 AM IST

kishan-reddy
ప్రధాని మోడిపై దేశప్రజలే కాకుండా.. మహారాష్ట్ర మరియు హర్యానా ప్రజలు కూడా నమ్మకం ఉంచారని.. అందుకే మహా, హర్యానాలో బీజేపిని గెలిపిస్తున్నారని.. తెలంగాణ బీజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అవినీతి పాలనకు కాలం చెల్లిందని అన్నారు. ఇకపై దేశంలోని ప్రజలందరికీ స్వచ్చమైన పాలన అందుతుందని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో శివసేన ఎప్పటికీ మిత్రపక్షమే అని, ఒకవేళ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకుంటే.. శివసేన మద్దతు కోరతామని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్సీపీతో పొత్తుపెట్టుకునే అవకాశం లేదని ఆయన అన్నారు. హర్యానాలో ఇప్పటికే బీజేపి మెజారిటీ సాధించిందని.. మరి కాసేపట్లో అధికారికంగా అన్నివిషయాలు తెలుస్తాయని ఆయన తెలియజేశారు.