పోటీలో దూసుకుపోతోన్న బీజేపీ.. పడిలేస్తున్న కాంగ్రెస్!

Tuesday, May 15th, 2018, 11:10:14 AM IST

చూస్తుంటే కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ ఇకు దెబ్బ కొట్టేలా కనిపిస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా భారత జనతా పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండడం ఆశ్చర్యాన్నిక కలిగిస్తోంది. 222 నియోజక వర్గాల్లో గట్టి పోటీని ఇస్తూ దాదాపు 118 చోట్ల ఆధిక్యంతో దూసుకుపోతుండడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పడిలేస్తున్నా పరిస్థితి కష్టంగానే ఉంది. మొదటి విజయం దక్కించుకున్న బీజేపీ అదే తరహాలో కంటిన్యూ చేస్తుంది అనేలా టాక్ వస్తోంది. 65 నుంచి 57 కు పడిపోయిన కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో అధికారాన్నికఁ అందుకుంటుంది అనేది చివరి వరకు సస్పెన్స్ అనేలా ఉంది. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 112. దాదాపు బీజేపీ ఆ నెంబర్ లోనే ఉంది. చూస్తుంటే పోటీలో ఉన్న మరో ముఖ్య పార్టీ జేడీఎస్ మద్దతు కూడా అవసరం లేదు అనిపిస్తోంది.