ప్రజలు చస్తుంటే ఆలయాల్లో సంపద ఎందుకు : బీజేపీ నేత

Friday, September 14th, 2018, 02:43:15 PM IST

గత కొన్ని రోజుల క్రితం వరకు నిర్విరామంగా కురిసిన వర్షాలకు కేరళ జన జీవనం స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. 400 మందికిపైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక కేరళకు సినీ ప్రముఖులతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మెయిన్ గా సాదారణ ప్రజలు అండగా నిలిచారు. అయితే వరదల తాకిడికి వేల కోట్ల ఆస్తి నష్టాలు. ప్రకృతి బీభత్సానికి చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ప్రభుత్వ ఆస్తులు సైతం వందల కోట్లల్లో నీటిపాలయ్యాయి.

దాదాపు మొత్తంగా 21 వేల కోట్ల వరకు నష్టం జరిగింది. అయితే కేరళ పునర్నిర్మాణం కోసం ప్రసిద్ధ ఆలయాల్లోని బంగారు సంపదను ఉపయోగించాలని భారత జనతా పార్టీ నేత ఎంపీ ఉదిత్ రాజ్ తెలియజేశారు. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైన సంపన్న దేవాలయాల్లో పద్మనాభస్వామి ఆలయం, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం, గురువాయూర్‌ ఆలయంలు ఉన్నాయి. అయితే ఆ ఆలయాల్లోని సంపద బంగారాన్ని వినియోపగించడం ద్వారా రాష్ట్రము కోలుకోగలదని అన్నారు. ఎందుకంటే ఆ మూడు ఆలయాల్లో లక్షల కోట్లకు పైగా సంపదని ఉందని 21 వేల కోట్లతో పోలిస్తే అది ఎక్కువే అని అన్నారు. ఆ విధంగా చూసుకుంటే కేరళను ఆధుకోవచ్చని ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, చనిపోతున్నప్పుడు ఉపయోగపడని ఆ సంపద వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తూ.. ప్రజలు కూడా తనకు మద్దతు ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments