చంద్రబాబు సర్కార్ పై బీజేపీ నేత సంచలన కామెంట్లు!

Thursday, January 25th, 2018, 08:03:54 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం లో బిజెపి తో పొత్తుపెట్టుకున్నప్పటినుండి ఆ పార్టీ పై ఎప్పుడు ప్రత్యక్ష విమర్శలకు దిగలేదు. అంతే కాక బాబు పార్టీ లోని ఇతర నేతలను కూడా బిజెపి పై ఎటువంటి అభ్యంతర వ్యాఖ్యలు కూడా చేయొద్దని వారిస్తూనే ఉంటారనేది టీడీపీ లో కొందరి వాదన. కాని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాత్రం చంద్రబాబు సర్కార్ పై, ఏకంగా కొన్ని ప్రత్యక్ష విమర్శలే చేశారు. కేవలం చంద్రబాబు నే కాక, ఐటి మంత్రి లోకేష్ ని కూడా ఆయన విమర్శించిన తీరు పెను సంచలనమే రేపుతోంది. ఓ పక్క పార్టీ లో కి వచ్చిన ఫిరాయింపు ఎమ్యెల్యే ల కు మంత్రి పదవులు కట్టబెట్టిన తీరు పై కొన్ని వర్గాలు చేస్తున్న విమర్శలు అందరికి తెలిసినవే. ఆయన కూడా ఈ సారి ఏకంగా పార్టీ ఫిరాయింపు మంత్రులనే టార్గెట్ చేశారు. వైసిపి నుంచి ఎన్నికైన ఎమ్యెల్యే లు మంతులుగా కొనసాగడం దారుణమన్నారు. పార్టీ మరీన ఎమ్యెల్యే లు వెంటనే రాజీనామా చేయాలని, ఒకవేళ అలా కాకుంటే పార్టీ ఫిరాయించినా సరే మంత్రులు కావచ్చు అనే ఒక కొత్త రకమైన చట్టం తీసుకురావాలని చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. గత వారం మంత్రి లోకేష్ ను ఇరకాటం లో పడేసేలా వ్యాఖ్యలు చేశారు. ఐటి రంగ పరిస్థితుల పై లోకేష్ కు అవగాహన లేదని, ఆ రంగం లో పరిస్థితులు ఒకలా ఉంటే ఆయన మాటల తీరు వేరే లా ఉందని విమర్శించారు. లోకేష్ త్వరలో 10 లక్షల ఐటి ఉద్యోగాలు కల్పిస్తామని అన్న మాటకు ప్రతిగా ఆయన మాట్లాడుతూ ఒక వైపు ఐటి రంగంలోని ఉద్యోగాలు ఇబ్బందుల్లో ఉంటే లోకేష్ ఈ విధంగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అంతేకాక రాష్ట్రం లోని అవినీతి, రౌడీయిజం పై కూడా విమర్శలు గుప్పించారు. రౌడీయిజం వల్లే రాష్ట్రం లో ఇసుక ధరలు పెరిగాయన్నారు. విచ్చలవిడిగా ఇసుక మాఫియా రెచ్చిపోతుంటే దాని పై సర్కార్ తగిన చర్యలు తీసుకోకపోవడం సరైనదికాదన్నారు. విశాఖ లో తహసీల్దార్ , ఆర్ అండ్ బి ఈయన్సీ పై ఎసిబి సోదాలు చేయించామని వందల కోట్ల అవినీతి సొమ్ము జప్తు చేయించామన్నారు. రాష్ట్రం లో రైతులకు ఉదయం పూటే 10 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. భూమి పైన స్థలం లేకుంటే సముద్రం లో కూడా మద్యం దుకాణం పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానం ఉందని ఎద్దేవా చేశారు….