నేను హోమ్ మంత్రినైతే మేధావులను చంపేయమంటా!

Friday, July 27th, 2018, 02:43:58 PM IST

రాజకీయ నాయకుల్లో చాలా మంది కొన్ని సార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు మూగట్టుకోవడం అలవాటే. ముఖ్యంగా ఇటీవల కాలంలో భారత జనతా పార్టీ నేతల్లో కొంతమంది అదే తరహాలో డైలాగ్స్ వదులుతూ అధిష్టానానికి తలనొప్పి తెప్పిస్తున్నారు. మాడ్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని తరచు వివాదస్పద వ్యాఖ్యలు చేయకూడదని ప్రధాని మోడీ సభల్లో డైరెక్ట్ గా చెబుతూనే ఉంటారు. ఇక పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా అనేక సార్లు పార్టీ నేతలతో ఈ విషయంపై చర్చలు జరిపారు.

అయినా కూడా కొంత మంది నేతల్లో ఎలాంటి మార్పు లేదు. అసలు విషయంలోకి వస్తే రీసెంట్ గా
కర్ణాటకకు చెందిన ఓ సీనియర్‌ భాజపా ఎమ్మెల్యే దేశంలో మేధావులను కాల్చి చంపేస్తానని చెప్పడం వివాదస్పదంగా మారింది. విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా మాట్లాడుతూ.. మహామేధావులు జనం సొమ్ముతో సకల సౌకర్యాలు అనుభవిస్తుంటారు. అయితే వారు భారత జవానులకు విరుద్ధంగా మాట్లాడుతుంటారు. మిగతా వారి కంటే ఇలాంటి మేధావుల నుంచి లౌకికవాదుల నుంచే ముప్పు ఉంది. అందుకే నేనుగానక హోమ్ మంత్రిని అయితే వారందరిని కాల్చి చంపేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తానని బసగౌడ తెలుపడం వివాదస్పదంగా మారింది. ఇతర పార్టీ నేతలు ఆయన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ నేత ముస్లిమ్ లకు ఎవరు సహాయపడవద్దని చెప్పి విమర్శలు తెచ్చుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments