చంద్రబాబు పై మండిపడ్డ బిజెపి నేత!

Sunday, May 20th, 2018, 04:54:06 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ పై, పార్టీ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు రమేష్ అన్నారు. నేడు అయన విజయవాడలో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలు టిడిపి ని నమ్మే పరిస్థితి లేదని, కేంద్రం ఏపీకి తగు స్థాయిలో నిధులు ఇచినప్పటికే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అబద్దాలు ఆడుతోందని ఆయన అన్నారు. నిజానికి కర్ణాటకలో బిజెపిని ఓడించడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు డబ్బు, మనుషులను ఉపయోగించి చాలా కుయుక్తులు చేశారని, వాటికి సంబందించిన ఆధారాలు త్వరలో తమ పార్టీనేతలు బయటపెడతారని అన్నారు. అలానే చంద్రబాబు చెపుతున్నట్లు కర్ణాటకలో తెలుగువారు ఓట్లేయకపోవడం వల్లే యెడ్యూరప్ప ప్రభుత్వం అధికారం చేపట్టలేకపోయిందని అనడం ఆయన అనాలోచిత తనానికి నిదర్శనమని అన్నారు.

ఒకవేళ నిజంగా అక్కడి మన తెలుగువారు బిజెపికి ఓట్లువేయకపోతే కనకగిరి, పద్మనాభ నగర్ లో బీఏపీ అభ్యర్థులు ఎలా గెలుస్తారని విమర్శించారు. అయినా కేంద్రం లో వున్న మోడీ పై నమ్మకంతో, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వంపై అపనమ్మకంతోనే అక్కడి ప్రజలు అత్యధికంగా బిజెపికి ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. అయినా చంద్రబాబు కాంగ్రెస్ నేతలను బానే వెనకేసుకొస్తున్నారని, త్వరలోనే ఆయనకు ఆంధ్ర ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బిజెపి అధికారం లో ఉన్నప్పటికీ తమకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ప్రకారం మరొక ఏడుగురు ఎమ్యెల్యేలను తమ వైపు తిప్పుకోవడం తమకు కష్టమేమి కాదని, కాకపోతే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి యెడ్యూరప్ప రాజీనామా చేసారని, చంద్రబాబు వంటి నేతలు వారిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు…..

  •  
  •  
  •  
  •  

Comments