చంద్రబాబు ఇంకెంత కాలం ఈ ఇసుక మాఫియా..? : బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు

Friday, September 7th, 2018, 04:00:30 PM IST

ఆంధ్ర రాష్ట్రం లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిన్ననే మొదలయ్యాలి మొదటి రోజు పురస్కరించొకొని రెండవ రోజు బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయం పై బీజేపీ నేత ఐన విష్ణు కుమార్ రాజు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం మరియు అభిమానం ఉంది అని, అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మీద ఏం అనాలో అర్ధం కావట్లేదు అని జాలేస్తుంది అని అన్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే గత 15 రోజులు నుంచి విశాఖపట్టణానికి ఒక్క ఇసుక లారీ కూడా రావడం లేదు అని, ఇంత కన్నా దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉందా? అని వ్యాఖ్యానించారు. విశాఖలో మంత్రులు కూడా ఈ విషయం పై ఏ చర్యలు తీసుకోవట్లేదు అని, జీవీఎంసీ కి సంబందించిన పనులన్నీ అక్కడ ఆగిపోయాయి అని, అది ఎందుకంటే ఈ ఇసుక మాఫియా దోపిడీ కారణంగా లారీ డ్రైవర్లు వారు ఇసుక ని తీసుకురావడాన్ని నిలిపివేసి నిరసన చేస్తున్నట్టు తెలిపారు. ఒక్కొక్క రాజకీయ నేతల అండదండలతో దాదాపు వెయ్యి లారీలకు ఎనిమిది వేల చొప్పున ఇసుక బయటికి వస్తుంది అంటే రోజుకి ఎనభై లక్షల వరకు ఆదాయం వస్తుంది అని నెలకి 24 కోట్లు సంవత్సరానికి సుమారు 240-250 రూపాయలు వస్తుంది అని పేర్కొన్నారు.

గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఇసుక మాఫియా కోసం చంద్రబాబు కి తెలియకుండా ఉండదని అయినా దానిపై ఎందుకు చర్యలు తీసుకోకుండా ఉంటున్నారని ప్రశ్నించారు, చాలా వరకు ప్రభుత్వ పనులు అన్ని ఆగిపోయాయి అని మీ అధికారులు అందరితో కలిసి వెళ్లి శ్రీకాకుళం విశాఖపట్నం వెళ్లి చూడాలని అధికారం లో ఉండి ఏం చెయ్యలేకపోతే మాకు ఇవ్వండి అధికారం నెల రోజుల్లో లోపల చేసి చూపిస్తాం మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments