తేరాస నాయ‌కులు క‌ట‌క‌టాల్లోకేన‌ట‌!!

Monday, October 22nd, 2018, 11:10:15 PM IST

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ త‌ప్ప మ‌రో సీటు గెల‌వ‌ని, గెల‌వ‌లేని పార్టీ ఏదైనా వుందంటే అది క‌చ్ఛితంగా భార‌తీయ జ‌న‌తా పార్టీనే అని చెడ్డీ వేసుకోని పోర‌గాడు కూడా ట‌క్కున చెప్పేస్తాడు. అలాంటి వాళ్లు అధికార పీఠాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంటార‌ట‌. మేము అధికారంలోకి వ‌స్తే కేసీఆర్‌పై, అత‌ని మంత్రి వ‌ర్గ స‌భ్యుల‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని బీజేపీ తెలంగాణ జాతీయ అధ్య‌క్షుడు ఎన్‌.ఇంద్ర‌సేనారెడ్డి సోమ‌వారం బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయ విశ్లేష‌కుల్ని విస్మ‌యానికి గురిచేస్తోంది.

తెరాస అధినేత కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి తామే వ‌స్తామ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నాడ‌ని, అది జ‌రిగే ప‌ని కాద‌ని దుయ్య‌బ‌ట్టారు. 2014లో ఏదో అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను అడ్డుపెట్టుకుని, క‌ళ్ల‌బొల్లి వాగ్థానాలు చేసి వాటి ద్వారా అధికార పీఠాన్ని ఎక్కార‌ని, ఈసారి అది అసాధ్య‌మ‌ని తెరాస పై విమ‌ర్శ‌లు గుప్పించాడు. తెరాస స‌భ్యులు మాత్రమే సంతోషంగా ఉన్నార‌ని, ప్ర‌జ‌లు మాత్రం చాలా అస‌హ‌నంతో వున్నార‌ని, కేసీఆర్ కుటుంబ స‌భ్యులు మాత్రం ఓడిపోతామ‌న్న అస‌హ‌నంతోనే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నార‌ని ఎన్‌. ఇంద్ర‌సేనారెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ ప్ర‌తినిధి రాహుల్ గాంధీని న‌మ్మే స‌న్నివేశంలో దేశ ప్ర‌జ‌లు లేర‌ని, కుంభ కోణాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన కాంగ్రెస్‌ను మ‌ళ్లీ అధికార‌పీఠం ఎక్కించే తప్పును మ‌ళ్లీ దేశ ప్ర‌జ‌లు చేయాల‌నుకోవ‌డం లేద‌ని ఇంద్ర‌సేనా రెడ్డి భారీ డైలాగులే సంధించాడు. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎందుకు అస‌హ‌నంతో వున్నారో..సింగిల్ డిజిట్‌కు ప‌రిమిత‌మైన బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం ఏంటో…సీనియ‌ర్ నాయ‌కుడై వుండి ఇదేం కామెడీ ఇంద్ర‌సేనా అని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు న‌వ్వుకుంటున్నారు. ప్ర‌స్తుత స‌న్నివేశంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో భాజ‌పాకి అనుకూల ప‌వ‌నాలు ఉన్న‌ట్టు సంకేతాలు లేవు. అటు ఏపీలో ఇప్ప‌టికే `ప్ర‌త్యేక హోదా` సెగ భాజ‌పాని ఇర‌కాటంలోకి నెట్టేసింది. ఇటు తెలంగాణ‌లో గులాబి ద‌ళ‌ప‌తిపై వ్య‌తిరేక‌త కాంగ్రెస్‌- మ‌హాకూట‌మికి క‌లిసొచ్చే స‌న్నివేశం క‌నిపిస్తోందని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి వేళ ఇంద్ర‌సేన వ్యాఖ్య‌ల్ని కామెడీగానే భావిస్తున్నారంతా.

  •  
  •  
  •  
  •  

Comments