చంద్రబాబు,లోకేష్ లకు ఉన్న ధన దాహం ఎవరికీ లేదు..!

Sunday, October 21st, 2018, 10:38:04 AM IST

2014 ఎన్నికల తర్వాత గత నాలుగేళ్లు టీడీపీ మరియు బీజేపీ ఇరు పార్టీలు చెట్టపట్టాలు వేసుకొని బాగానే తిరిగారు వారు ఏం చెప్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవిబంచడం,విభజన హామీలు ప్రత్యేకహోదా కోసం తెలుగుదేశం ప్రభుత్వం పోరాడకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ విడిపోయింది.ఇక అప్పటి నుంచి ఇరు పార్టీల వారు ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.అటు తెలంగాణా మరియు ఇక్కడ ఆంధ్రా లలో వీరు అధికారంలోకి వస్తారో రారో తెలీదు కానీ అధికార పక్షాన ఉన్న వారిని మాత్రం ఒక్క లెక్కలో విమర్శిస్తున్నారు.

ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదను మరియు ఆయన తనయుడు లోకేష్ మీద చాలా సార్లు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సారి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖలు మళ్ళీ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర చందనం అక్రమ రవాణా చంద్రబాబు హయాంలోనే జరుగుతుందని,అతని తనయుడు నారా లోకేష్ కు అపారమైన ధన దాహం అని ఇద్దరు ఒకేలాంటివారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ గడిచిన ఇన్నేళ్ళలో ప్రజల ముందు నిల్చోని మేము ఈ పని చేశాం అని చెప్పే దమ్ము మీకు ఉందా?అని కన్నా చంద్రబాబుకి సవాలు విసిరారు.ప్రాజెక్టులకు,పథకాలకు కొన్ని వేల కోట్లు ఇస్తే వాటిని దోచేసుకుంటున్నారే తప్ప ఆ పనులకు ఉపయోగించడం లేదని మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments