నిరుద్యోగుల పేరిట లోకేష్,అభివృద్ధి పేరిట బాబు రాష్ట్రాన్ని దోచేస్తున్నారు.!

Thursday, September 27th, 2018, 01:05:35 AM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే ఏ పార్టీకి సంబందించిన నాయకులు వారు వారి ఎత్తుగడలతో 2019 ఎన్నికలలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు,వారిలో బీజేపీ పార్టీ వారిని చూస్తే ఒకింత జాలి కూడా వేస్తుంది,ఆంధ్రప్రదేశ్లో వారు అధికారం చేజిక్కించుకోవడం అసంభవమని వారికి కూడా తెలుసు కానీ వారు ఎప్పటికప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించడంతో మాత్రం ముందుంటున్నారు.

ఆ దారిలోనే ఇప్పటి వరకు బీజేపీ ముఖ్య అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశ్నలు వర్షమే కురిపించారు,ఇప్పుడు తాజాగా మళ్ళీ బాబు గారిని ఆయన తనుయుడు లోకేష్ గారి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.అవుట్ సోర్సింగ్ పేరిట నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలని నారా లోకేష్ అమ్ముకుంటున్నారని,ఆ ఉద్యోగాల అమ్ముకోగా వచ్చిన డబ్బు లోకేష్ అకౌంట్ లోకి వెళ్తాయని,ఆన్లైన్ పద్ధతిలో ఉద్యోగులకు జీతాలు వెయ్యడంలో కూడా లోకేష్ అవినీతి చేస్తున్నారని ఆరోపించారు.అంతే కాకుండా 10 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 240 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా చూపించి,అభివృద్ధి పేరిట చంద్రబాబు దోచేస్తున్నారని లక్ష్మినారాయణ తీవ్ర విమర్శలు చేశారు.