నాలుగేళ్లలో కెసిఆర్ తెలంగాణను రెండో అవినీతి రాష్ట్రంగా మార్చేశారు..బీజేపీ నేత.!

Sunday, October 21st, 2018, 10:27:25 PM IST

ఏది ఏమైనా సరే తెలంగాణా రాష్ట్రంలో ఈ సారి ప్రతీ ఒక్క పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం తెరాస పార్టీయే అని చెప్పాలి.ఒక పక్క మహాకూటమిలోని ప్రధాన పార్టీలు మరో పక్క భారతీయ జనతా పార్టీ గెలుపోటములు పక్కన పెట్టి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నా సరే వీరి యొక్క ప్రధాన ప్రత్యర్థి మాత్రం తెరాస పార్టీయే.ఒకరిని మించిన స్థాయిలో మరొకరు కెసిఆర్ సర్కారును ఎండగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.ఇప్పుడు తాజాగా బీజేపీ పార్టీ కి చెందినటువంటి జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ కెసిఆర్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజు మల్కాజ్ గిరిలోని జరిగినటువంటి సభలో రామ్ మాధవ్ మాట్లాడుతూ కెసిఆర్ కి ఐదేళ్ళు పాలించమని అధికారం అప్పజెపితే అది చేతకాక నాలుగేళ్లు మాత్రమే పనిచేసి చేతులెత్తేసారని మండిపడ్డారు.అంతే కాకుండా తాను అధికారంలోకి వచ్చాక తెలంగాణాని “బంగారు తెలంగాణాగా” మారుస్తానని చెప్పిన కెసిఆర్ అది చేశారో లేదో తెలీదు కానీ ఆయన ఇల్లు మాత్రం బంగారంతో నిండిపోయిందని,వారి యొక్క కుటుంబాలు బంగారు కుటుంబాలు అయ్యిపోయాయని మండిపడ్డారు.కెసిఆర్ యొక్క నాలుగేళ్ల దుష్పరిపాలనలో భారతదేశం అంతటిలో తమిళనాడు తర్వాత రెండో అవినీతి రాష్ట్రంగా తెలంగాణను మార్చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.