కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మూసి మురికిలో వేసినట్టే..!

Wednesday, October 10th, 2018, 04:00:49 AM IST

తెలంగాణలోని ఒక్కో పార్టీ వ్యూహం ఒక్కక్కటి ఒకరి మీద ఒకరు విమర్శలు,ప్రతి విమర్శలు మరియు తిట్ల పురాణాలు.ఇప్పుడున్న పరిస్థితిల్లో తెలంగాణా రాష్ట్రంలోని డిసెంబరు నెలలో ఒంటరిగా పోటీ చేసే పార్టీలు ఏవి అంటే ఒకటి తెరాస మరియు మరొకటి కాంగ్రెస్ అని చెప్పాలి.రాజకీయంగా ఈ రెండు పార్టీలకి విభేదాలున్నా అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రం లోను వీరి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి కే లక్ష్మణ్ తెలంగాణా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో మరియు దేశంలో ఎవరు ఎలా పని చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని,ప్రజలే వారికి బుద్ధి చెప్తారని తెలియజేసారు.డిపాజిట్లు గల్లంతైన కాంగ్రెస్ పార్టీ వారు బీజేపీ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని లక్ష్మణ్ అన్నారు.మమ్మల్ని విమర్శించే ముందు మీ సంగతి ఏంటో ఒక్క సారి సరి చూసుకొండి అని,21 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న మీరు ఇప్పుడు ఎంత మంది ఉన్నారో చూసుకోండి అని ప్రశ్నించారు.అందుకని ప్రజలు తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీకు వేసి వృధా చేసుకోవద్దని,ఒకవేళ కాంగ్రెస్ పార్టీకు ఓటేస్తే అది మూసి నది మురికిలో వేసినట్టు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.