ప్రకాష్ రాజ్ కు ప్రశ్నలతో షాకిచ్చిన బిజెపి నేత!

Tuesday, May 8th, 2018, 02:14:35 AM IST

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాట చాలా గరుకుగా ముక్కుసూటిగా ఉంటుంది. గత కొద్దిరోజులుగా బిజెపి నేతలను, ప్రధాని మోడీని జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్విట్టర్ లో ప్రశ్నలు సంధించడం, దానికి బదులుగా కొందరు బిజెపి నేతలు ఆయనపై మాటలతో విరుచుకుపడడం చూసాము. ఇకపోతే బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ముక్కుసూటి మనిషే, తప్పు ఉందని తేలితే తమ పార్టీ వారిని సైతం దుయ్యపట్టడానికి సుబ్రహ్మణ్య స్వామి వెనుకాడరు. అటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు అనూహ్యంగా ఒకే వేదికపై కలుసుకున్నారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన డిబేట్ లో ప్రకాష్ రాజ్, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరూ, కొందరు నేతలతో కలిసి ఆ డిబేట్ లో పాల్గొన్నారు.

ఈ డిబేట్ సందర్భంగా ప్రకాష్ రాజ్ ను ఒకింత ఇరుకునపెట్టే విధంగా సుబ్రహమన్య స్వామి తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. వాటికి ప్రకాష్ రాజ్ సమాధానాలు చెప్పడానికి కొంత తడుముకున్నట్లయిందని చెప్పవచ్చు. తొలుత ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, మీరు చేస్తున్న పనులను బట్టి చూస్తే భరత్ ను కేవలం ఒక హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నారు, అందువల్ల ఇతర ముస్లిం దేశాలు అక్కడ వున్న హిందువులను తరిమికొడితే పరిస్థితి ఏంటని స్వామిని ప్రశ్నించారు. దానికి ఆయన జవాబిస్తూ, నిజానికి ఈ దేశంలో ముస్లిం ల దాక ఎందుకు, హిందువులకే సరైన రక్షణ లేదని, ఏదైనా వారికి వ్యతిరేకంగా వివక్ష ఏర్పడితే అంతా ఏకంగా కావాలని కోరినట్లు తెలిపారు.

అయితే భారత దేశంలో ముస్లిం లు ఇతరదేశాల్లోని హిందువులకన్నా ప్రశాంతంగా హాయిగా వుంటున్నారు కదా, అదీ కాకా ముస్లిం దేశాల్లో మన హిందువుల గుడి కట్టే అవకాశం లేదని, కానీ ముస్లిం రాజులు మన దేశంలోని దాదాపు 47వేల దేవాలయాల్ని ద్వాంశం చేస్తే మీ లాంటి సూడో సెక్యూలరిస్టులు ఎందుకు ప్రశ్నించరని గట్టిగ అడిగారు. ఆయన మాటలకు ప్రకాష్ రాజ్ కొంత తడపడ్డారు. కాగా కుమారస్వామి ప్రశ్నలకు ఆ ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది…..