జనసేన గూటికి బీజేపీ నేత ?

Tuesday, March 13th, 2018, 03:15:08 AM IST

భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పార్టీ ఆదేశం మేరకు క్యాబినెట్ లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎన్నికల సమయానికి మరొక పార్టీ గూటికి చేరే అవకాశం లేకపోలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్న తప్పుడు ఆరోపణలు, నిందలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పరిస్థితి ఒకింత దారుణంగా ఉందని చెప్పవచ్చు. కొంతమంది పేరున నేతలు ఉన్నప్పటికీ, వారి సేవలు ఎంతవరకు ఉపయోగపడతాయ్ అనేది చెప్పలేం. ఇలాంటి పరిస్థితిలో ఆ పార్టీ తరఫున పోటీ చేయటానికి నాయకులు మొగ్గు చూపకపోవచ్చు అని తెలుస్తోంది.

గతంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఎదురైంది, ప్రస్తుతం బిజెపికి కూడా అటువంటి పరిస్థితి తప్పేలాలేదని సమాచారం. ఇక కామినేని శ్రీనివాస్ విషయానికొస్తే తాను మాత్రం కమలం గూటి నుంచి వేరే గూటికి చేరే అవకాశాలు కనబడుతున్నట్లు తెలుస్తోంది. అలానే అందుతున్న సమాచారం ప్రకారం ఆయా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మొదట పవన్ ను ఆశ్రయించిన కామినేని ఆయన సూచన మేరకే చంద్రబాబు వద్దకు వెళ్ళి తద్వారా బిజెపి టిక్కెట్ సంపాదించారన్న ప్రచారం ఉంది. దీన్నిబట్టి చూస్తే పైకి చెప్పనప్పటికీ ఆయన మాత్రం వేరే పార్టీ గూటికి చేరేఅవకాశం ఉందని కొన్ని రాజకీయ వర్గాల భోగట్టా….

  •  
  •  
  •  
  •  

Comments