వీడియో : బీజేపీ లీడర్ ను చితకబాదారు..ఇంతకీ ఎక్కడా..?

Saturday, April 7th, 2018, 01:06:33 PM IST

రోజులు గడుస్తూ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ కేంద్రంపై కొన్ని రాష్ట్రాలకు పూర్తిగా నమ్మకం లేకుండా పోతుంది. ప్రచారం అంటూ దగ్గరకు వస్తే కొట్టి చంపేలా ఉన్నారు. ఇటివల ఇలాంటి ఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలలో చోటు చేస్కుంది. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర యుద్ధ వాతావరణం తలపిస్తుంది. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు ఇతర విపక్ష పార్టీల మధ్య ఊహించని యుద్ధమే జరుగుతుంది. బీజేపీ నేతల నామినేషన్లను అడ్డుకునేందుకు తృణమూల్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని బంకూరలో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీజేపీ నేత శ్యామ్‌పాడ మండల్ నేతపై తృణమూల్ కార్యకర్తలు ఏకధాటిగా దాడులు చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీస్ వద్ద ఆయనను అడ్డుకొని.. కారులో నుంచి బయటకు లాగి చితకబాదారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో దాడికి పాల్పడ్డ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. తృణమూల్ కార్యకర్తలే బీజేపీ లీడర్లపై దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. తమ కార్యకర్తలు ఎలాంటి దాడులకు పాల్పడటం లేదని.. బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని తృణమూల్ లీడర్లు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు మే 1, 3, 5వ తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇంతటి యుద్ద పరిణామాలు కేంద్రం పార్టీపై జరుగుతున్నాయంటే ఒకటి బీజేపీ పై నమ్మకం లేకుండా అయినా ఉండాలి లేదా ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్ర అయినా ఉండాలి అని కొందరి రాజకీయ విశ్వాసకుల ఆలోచన.