కాంగ్రెస్ జేడీఎస్ విడిపోతాయ్: యడ్యూరప్ప

Thursday, May 24th, 2018, 01:33:04 AM IST

గత ఎన్నికల్లో ఫలించిన ప్రణాళికలే కర్ణాటక ఎలక్షన్స్ లో కూడా సక్సెస్ అవుతాయని భారత జనతా పార్టీ చాలానే ట్రై చేసింది. కానీ ఊహించని విధంగా అధికారం మిస్ అవ్వడం ఇప్పుడు పార్టీ నేతల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అందరికంటే ఎక్కువ (104) నియోజక వర్గాల్లో గెలిచినప్పటికీ కేవలం 8 సీట్లు తక్కువవ్వడం వలన బీజేపీ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. జేడీఎస్ – కాంగ్రెస్ వారి నేతలను నాలుగు రోజులు కంటికి రెప్పలా కాపాడుకొని బీజేపీ కి తలొగ్గకుండా చేసింది.

మొత్తానికి పై చెయి సాధించిన ఒప్పందం ప్రకారం మంత్రి శాఖలను సమానంగా పంచుకొని జేడీఎస్ – కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకున్నాయి. అయితే బీజేపీ నుంచి ముందు సీఎం గా ప్రమాణస్వీకారం చేసి రెండు రోజుల్లోనే బల నిరూపణ లేక యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం యడ్యూరప్ప కాంగ్రెస్ – బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎక్కువగా బీజేపీ పైనే మొగ్గు చూపించినప్పటికీ కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలను నడిపిస్తోందని చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ – జేడీఎస్ కలిసి ఉండడం అసాధ్యం అంటూ.. మూడు నెలలు కూడా ప్రభుత్వాన్ని నడిపించలేవు అని జోస్యం చెప్పారు. అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం కర్ణాటకలో సరికొత్త మార్పు తీసుకు వస్తాం అని వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తూ పార్టీ బలాన్ని పెంచుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments