బీజేపీ నేతలు చెపుతున్నవి కేవలం లెక్కలు మాత్రమే: ఏపీ టిడిపి నేతలు

Sunday, February 11th, 2018, 08:45:16 PM IST

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగిందని రాష్ట్ర నేతలందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టిడిపి నేతలు చేస్తున్నావని అసత్య ఆరోపణలని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కంభంపాటి హరిబాబు 27 పేజీల ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేసిన ప్రకటన పై రాష్ట్రటిడిపి నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పలువురు నేతలు తమ అభిప్రాయలు పంచుకున్నారు. మిగతా దక్షిణ భారత రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకూ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలి. అసంబద్ధ విభజన వల్ల ఆస్తులన్నీ కోల్పోయాం ఆ సమయంలో రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంది. అయితే ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం 90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలి. తలసరి ఆదాయం ప్రకారం చూసుకుంటే రాష్ట్రానికి చాలా రావాల్సి ఉందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.

బిజెపి నేతలు చెపుతున్నవి కేవలం లెక్కలని, తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్ర కు ప్రత్యేక ప్యాకేజీలో పేర్కొన్న విధంగా అన్ని హామీలు నెరవేర్చాలని, బడ్జెట్ లో సరైన కేటాయింపులు లేవని, దీని పై మేము అసంతృప్తిగా ఉన్నామని ఏపీ టిడిపి అధ్యక్షులు కల వెంకట్రావు అన్నారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయినా హామీలు నెరవేర్చలేదు. కేంద్రం మిగతా రాష్ట్రాలకు చేసినట్లే ఏపీకి నిధులు కేటాయిస్తోంది తప్ప ప్రత్యేక నిధులేమీ రావడం లేదు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలని ఆంధ్రులు కోరుకోవడం తప్పు కాదుకదా. పదేళ్ల సమయం ఉంది కదా అని ఎప్పుడో చేస్తామని చెప్పడం సరికాదు. ఆకలి వేసినప్పుడే అన్నం పెట్టండి. ఆంధ్రప్రదేశ్‌కు రూ.16వేల కోట్లు లోటు ఉందని కేంద్ర సంస్థలే తేల్చాయి. దాన్ని భర్తీ చేయాలని విభజన చట్టంలో ఉంది. అయినా పట్టించుకోరా? కేంద్ర బడ్జెట్‌ను రాష్ట్ర ప్రజలందరూ నిరాకరించారు.ఇప్పటికే చంద్రబాబునాయుడు 29 సార్లు ఢీల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినా పట్టించుకోవడం. ముఖ్యమంత్రి ఇంకా ఎన్నిసార్లు వెళ్లాలి. మిత్రపక్షంలో ఉన్నకాని ప్రజలకోసం పార్లమెంట్ లో పోరాడాము. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు….

  •  
  •  
  •  
  •  

Comments