అమ్మాయిలపై బిజెపి ఎమ్యెల్యే అనుచిత వ్యాఖ్యలు!

Sunday, May 6th, 2018, 03:48:10 PM IST

ప్రస్తుతం కేంద్ర బిజెపి కొంత మేర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు త్లెలుస్తోంది. ఒక వైపు ఆంధ్రలో ప్రత్యేక హోదా, అలానే విభజన హామీలు ఇవ్వలేదని అక్కడి అధికార విపక్షాలు వారి తీరుని తప్పుపడుతున్నాయి. అంతే కాక నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి ఉపయోగం లేని చర్యలని మరోవైపు యూపీఏ నాయకులు విమర్శిస్తున్నారు. మోడీ పేద ప్రజల పెన్నిధి అనుకుంటే ఆయన ప్రవేశపెట్టే విధానాల వల్ల ఎక్కువశాతం ధనికులకు మేలు జరుగుతోందనేది మరి కొందరి వాదన. ఇలాంటి కొన్ని సమస్యలను ఆ ప్రభుత్వం ఎదుర్కోక తప్పని పరిస్థితి. అయితే ఇప్పటికే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ వల్ల, ఆయన వ్యవహార శైలి వల్ల అక్కడ బిజెపి కొంత ప్రభావాన్ని కోల్పోయింది.

ఇకపోతే నేడు మరొక బిజెపి ఎమ్యెల్యే ఏకంగా అమ్మాయిలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసి పలు సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవల త్రిపురలో జరిగిన బిజెపి బహిరంగ సభలో ఆ ప్రాంత ఎమ్యెల్యే గోపాల్ పర్మర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో అమ్మాయిలను చాలా తేలికగా ఆకట్టుకోవచ్చని, నాలుగు తియ్యటి కబుర్లు చేపితే చాలా వారు మన వశమవుతారని అన్నారు. అందుకే అమ్మాయిలను కట్టడి చేయాలనీ, వారు స్వతంత్రులు కాలేరని, కానీ వారిపై కొంతమేర కంట్రోల్ ఉండడం మంచిదేనన్నారు. కాగా మన దేశంలో అమ్మాయిలకు వివాహ వయస్సు 18 ఏళ్ళు, కానీ అప్పటివరకు అమ్మాయిలు ఆగడం లేదు. ఈ లోపే ఎవరో ఒకరి వలలో పడుతున్నారు అన్నారు. అందుకే లవ్ జిహాద్ వంటి ఉదంతాలు పెరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను వారి కన్నా తల్లితండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని,

వారి చర్యలు, కార్యక్రమాలపై దృష్టి సారించాలని, అలానే లవ్ జిహాద్ నుండి దేశాన్ని రక్షికోవలసిన బాధ్యత ప్రతి ఆడపిల్లని కన్నా తల్లి, తండ్రిమీద ఉందన్నారు. నిజానికి తనకు 12 ఏళ్ళ వయసులోనే వివాహం జరిగినదని, కానీ అలా అని తాను బాల్య వివాహాలు ప్రోత్సహించడంలేదని, అయితే ఆడపిల్లలకు మాత్రం 18 ఏళ్లలోపు సాధ్యమయినంత త్వరగా పెళ్లిళ్లు చేస్తే మంచిదని హితవు పలికారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి. కాగా ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భోపాల్ రోడ్లు, హైవే ల మీద పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. పార్మర్ ఆడవారిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన్ని వదిలేదని లేదని పలు ప్రజాసంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి…..