హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్టు…

Tuesday, April 10th, 2018, 01:57:11 AM IST

మహారాష్ట్రలో ఇద్దరు శివసేన నేతల హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే శివాజీ కర్డిలేను ఇవాళ అహ్మాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల శివసేనకు చెందిన సంజయ్ కొతార్, వసంత్ థూబేలు హత్యకు గురయ్యారు. అయితే ఈ కేసులో రాహురి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. తనకు ఆ హత్యలతో ఎలాంటి సంబంధంలేదని, కానీ తనంతట తానే పోలీసులు ముందు లొంగిపోయినట్లు ఆ ఎమ్మెల్యే చెప్పారు. సంబంధం లేనప్పుడు ఎందుకు లోన్గిపోయావు అంటే మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు ఈ ఎమ్మెల్యే.

బీజేపీ ఎమ్మెల్యే శివాజీతో పాటు హత్యకు సంబంధం ఉన్న మరో 53 మంది పరారీలో ఉన్నట్లు ఆదివారం అహ్మాద్‌నగర్ పోలీసులు ఓ నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ ఎమ్మెల్సీ అరుణ్ జగ్‌తప్‌తో పాటు మరో 30 మంది కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కుట్రలో బీజేపీ ఎమ్మెల్యే పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఆ హత్యలతో లింకు లేదని, అనవసరంగా తనను వేధిస్తున్నారని, ఇంట్లో వాళ్లు భయపడుతున్న నేపథ్యంలో తాను పోలీసులు ముందు లొంగిపోయినట్లు బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు.