దొరికిందే ఛాన్సు..జగన్ జాబు నాదే అనేశాడుగా..!

Friday, November 10th, 2017, 08:30:27 AM IST

టీడీపీ – బిజెపిలు మిత్రపక్షాలనేకాని ఆ బంధం తెగిపోయి చాలా కాలం అయిందనేది లోగుట్టు. బిజెపి సొంతంగా ఎదగాలని అని భావించడం ఒక కారణమైతే.. జగన్ కు దగ్గరవుతోంది అనేది మరో వాదన. ఏపీ బీజేపీ ఇప్పటికే చంద్రబాబు అనుకూల వర్గం మరియు వ్యతిరేక వర్గం అంటూ రెండు వర్గాలుగా విడిపోయింది. చంద్రబాబుని విమర్శించడానికి, ఢిల్లీకి కంప్లైన్ట్ లెటర్ లు రాసె చంద్రబాబు వ్యతిరేక బిజెపికి ఇప్పుడొక మంచి అవకాశం దొరికినట్లయింది.

అంతా ఊహించిన విధంగానే బాబు వ్యతిరేకవర్గ బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత జగన్ రాకుంటేనేం.. తామున్నామని అనేశాడు. టీడీపీ తమ మిత్ర పక్షం అయినప్పటికి ప్రజా సమస్యల విషయంలో నిలదీస్తామని విష్ణుకుమార్ రాజు అన్నారు. తాము ఈ బాధ్యతని నెరవేర్చకుంటే మిత్రపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే అని ఆయన అన్నారు.

మొత్తానికి ప్రతిపక్షం లేకుండా చప్పగా సాగుతాయనుకున్న ఏపీ అసీంబ్లీ సమేవేశాలు టీడీపీ – బిజెపి మధ్య పోరుగా మారె అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు 20 మంది వరకు పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీకోలేదని.. ఈ చర్యకు నిరసనగా తాము అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నట్లు జగన్ ఇప్పటికే తేల్చేశారు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం దేశంలోనే ఓ వింత ఘటన అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments